హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ తల్లి సోనియా.. నష్టపోతామని తెలిసీ కూడా: రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ప్రపంచం ముందు భారత్‌ శక్తిమంత దేశంగా నిలబడటం కాంగ్రెస్‌ పాలనలోనే సాధ్యమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు.

'క్విట్‌ ఇండియా డే' సందర్భంగా గాంధీభవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్‌, మోడీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళిత, గిరిజన వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ఆ వర్గాలకు తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు.

tpcc chief revanth reddy praises sonia gandhi

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని రేవంత్ రెడ్డి గుర్తుచేవారు. రాజకీయంగా కాంగ్రెస్‌ నష్టపోతుందని తెలిసినా యువకుల బలిదానాలకు సోనియా గాంధీ చలించిపోయారని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. కానీ కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదన్నారు.

కార్యక్రమం జరిగిన తర్వాత రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు ఇంద్రవెల్లి సభకు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ దండోరా వాయించి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ లక్ష్యంగా ప్రసంగం సాగింది. తన తొలి బహిరంగ సభతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.

Recommended Video

Indian Americans సత్తా.. తెలుగు బిడ్డ Veena Reddy కీలక పదవులు | Rashad Hussain || Oneindia Telugu

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చంది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

English summary
tpcc chief revanth reddy praises sonia gandhi for become telangana state Establishment. she gave state he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X