ఇంతలోనే విషాదం: ఉమామహేశ్వరి మృతిపై చంద్రబాబు, లోకేశ్
కంఠమనేని ఉమా మహేశ్వరి మృతి తీవ్రంగా కలచివేస్తోంది. ఆమె మృతిపై నారా చంద్రబాబునాయుడు భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అనారోగ్యం, మానసిక ఒత్తిడి వల్లే ఉమా మహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఉమా మహేశ్వరి నివాసానికి చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా చేరుకున్నారు.
ఉమామహేశ్వరి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపామని గుర్తు చేసుకున్నారు. ఇంతలో విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరం అని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారని తెలిపారు. ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు.
ఎన్టీఆర్ గారి చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి గారి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపాం. ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరం.(1/2) pic.twitter.com/LuXBdrVcnB
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2022
కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణంపై నారా లోకేశ్ స్పందించారు. చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆమె మరణ సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ ఎంతో పెద్దమనసుతో దగ్గరుండి జరిపించేవారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. మార్గదర్శిగా నిలిచిన చిన్నమ్మ మృతి తమ కుటుంబానికి కోలుకోలేని విషాదం అని పేర్కొన్నారు. చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Devastated to even think that my beloved Chinnamma is no more. Never saw her without a bright smile and cheerful spirit. I will miss her and her motherly love. pic.twitter.com/M1Dra4SoXF
— Lokesh Nara (@naralokesh) August 1, 2022

ఉమామహేశ్వరి గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం అలముకుంది. ఆమెఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించినట్టు సమాచారం. ఆత్మహత్యకు కారణం ఆమె అనారోగ్యమని కూడా కొందరు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications