హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వావ్.. ఉపాసనకు యూఏఈ గోల్డెన్ వీసా.. క్రిస్మస్ గిప్ట్ అంటూ..

|
Google Oneindia TeluguNews

ఉపాసన.. మెగా ఇంటి కోడలు.. కానీ తనకంటుూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే మెగా కోడలు ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా అందజేసింది. సోషల్ మీడియా ద్వారా ఉపాసన వెల్లడించారు. ఇదీ క్రిస్మస్ కానుకగా అందుకున్నానని తెలిపారు.

ఇటీవల జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ప్రపంచమంతా ఒక్కటే అని తెలుసుకున్నానని ఆమె తెలిపారు 'వసుధైక కుటుంబం' అనే భావనకు అర్థం తెలిసిందని వివరించారు. యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషం కలిగిస్తోందని ఉపాసన పేర్కొన్నారు. మనసా వాచా భారతీయురాలినని, అయితే అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు గోల్డెన్ వీసా రాకతో అధికారికంగా ప్రపంచ పౌరురాలిని అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు.

upasana got uae golden visa

సాధారణంగా యూఏఈలో ఉద్యోగం, వ్యాపారం, చదువు కోసం వెళ్లే విదేశీయులకు అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. గోల్డెన్ వీసా ఉన్నట్టయితే నేషనల్ స్పాన్సర్ లేకుండానే యూఏఈలో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ వీసా ఉంటే 100 శాతం యూఏఈ పౌరుడిగానే భావిస్తారు. గోల్డెన్ వీసాలు లాంగ్ టర్మ్ వీసాలు. ఐదేళ్లు, పదేళ్ల ప్రాతిపదికన జారీ చేసే ఈ వీసాలు ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతాయి. 2019 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఇప్పటికే అనేకమంది భారత ప్రముఖులు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్రలకు ఈ వీసా దక్కింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబం కూడా ఈ గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు. తాజాగా మెగా కోడలు ఉపాసనకు ఆ గౌరవం లభించింది. ఆమె చేస్తోన్న మంచి కార్యక్రమాలతో యూఏఈ ఈ మేరకు గోల్డెన్ వీసా జారీచేసింది.

English summary
konidela upasana got uae golden visa. she happily announced in the social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X