టీఆర్ఎస్‌తో ఏడేళ్లు.. కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా పోటీ.. ఓటమి భయంతో సూసైడ్..!
వరంగల్ : రాజకీయాలైనా, ఇంకేదైనా గెలుపోటములు సహజమే. స్పోర్టివ్‌గా తీసుకున్నోళ్లు ముందుకెళతారు. ఓటమి చెందగానే డీలా పడితే వెనకపడిపోతారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన విస్మయం కలిగిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన ఓ నాయకుడు.. ఓటమి భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించడం చర్చానీయాంశమైంది.
మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని తాళ్లపూసలపల్లికి చెందిన రాచర్ల రాములు.. కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఎన్నికల ఖర్చుల కోసం అందినకాడికి అప్పులు చేశారు. అదలావుంటే ఫలితాలు రాకముందే అతడిని ఓటమి భయం పట్టుకుంది. ఒకవేళ ఓడిపోతే అప్పులు ఇచ్చినవారి నుంచి వత్తిడి పెరుగుతుందని భావించి సూసైడ్‌కు ప్రయత్నించారు.

గెలిచే అవకాశాలు సన్నగిల్లాయనే కారణంతో రాములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పురుగుల మందుతో పాటు నిద్రమాత్రలు కూడా తీసుకోవడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు వైద్యం అందిస్తున్నా కూడా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
రాములు పరిస్థితి చూసి ఆయన భార్య ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్‌లో ఏడేళ్లు పనిచేసినా.. తన భర్తకు తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు పిలిచి టికెట్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీచేయడం ఖర్చుతో కూడుకున్నందున అప్పులు చేసినట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో పలువురు సూటిపోటి మాటలు అంటుండటంతోనే తన భర్త ఆత్యహత్య చేసుకున్నట్లు తెలిపారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications