Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. తీరనున్న నీటి కష్టాలు..!
తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగట్టుతున్నాయి. అటు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీరు రోజు రోజుకి తగ్గిపోతోంది. దీంతో చాలా చోట్ల నీటి కొరత ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. శివారు ప్రాంతాల్లోనే కాదు.. సిటీలో కూడా నీటి సమస్యలు ఉన్నాయి. చాలా మంది నీరు లేకు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో ట్యాంకర్లు ధరలు భారీగా పెరిగి పోయాయి. ఒక్కప్పుడు ట్యాంకర్ కు రూ.500 తీసుకునే వారు ఇప్పుడు రూ. 1000 నుంచి రూ.1400 వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు హైదరాబాద్ జలమండలి కూడా నీటి కొరత రాకుండా చర్యలు తీసుకొంటోంది. హైదరాబాద్ కు నాగార్జున సాగర్ నుంచి రోజుకు 270 మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని మొదటగా.. అక్కంపల్లి రిజర్వాయర్ కు తరలిస్తారు.. అక్కడి నుంచి కొదండాపూర్ నీటి శుద్ధి కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి సిటీకి వాటరు వస్తాయి. నాగార్జునసాగర్ నీటి మట్టం తగ్గడంతో అధికారులు నీరు ఉన్న చోట పంపింగ్ చేయాలని నిర్ణయించారు. పుట్టంగండి వద్ద పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ అటు ఎల్లంపల్లి నుంచి కూడా నీరు వస్తోంది. అంతేకాకుండా మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా హైదరాబాద్ కు నీరు వస్తోంది. అంత కలిపి రోజుకు 500 మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే సరఫరా అవుతోంది. ఇందులో నాగార్జునసాగర్ నుంచి అధిక మొత్తంలో సిటీకి నీరు సరఫరా అవుతోంది. అటు ఎల్లంపల్లిలో కూడా నీటి నిల్వ తగ్గుతోంది. దీంతో మే 15 నుంచి అత్యవసర పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్ అవసరానికి నీరు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు రిజర్వాయర్లలో నీరు ఉందని అక్కడి నుంచి నీటి సరఫరా పెంచుతామని అధికారులు చెబుతున్నారు. జూన్ఆఖరు నాటికి హైదరాబాద్ కు నీటి సమస్య రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ లో వర్షాలు కురిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications