• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదంలో ఏం జరిగింది?.. సిలిండర్లు పేలాయా?

|

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ బ్యాంకుకు చెందిన స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నా.. మరోవైపు సిలిండర్లు పేలాయేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. 2500 స్టాళ్లు కొలువుదీరిన ఎగ్జిబిషన్ లో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా 300 కు పైగా పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. దాదాపు 40 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అంతా క్షణాల్లోనే..!

నాంపల్లి ఎగ్జిబిషన్ లో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. క్షణాల్లో మంటలు చెలరేగి.. 300కు పైగా స్టాళ్లకు వ్యాపించాయి. పోలీసులు, అధికారులు, ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. రాత్రి 11-11.30 గంటల సమయంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 3 గంటల పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించి మంటల్ని కంట్రోల్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కొందరికి గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

షార్ట్ సర్క్యూటా..? సిలిండర్లు పేలాయా?

ఓ బ్యాంకుకు చెందిన స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు. అయితే ప్రాథమిక విచారణ తర్వాత మరో కోణం బయటపడింది. మానవ తప్పిదం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన కొన్ని ఫుడ్ కౌంటర్స్ లో వినియోగించిన సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ప్రత్యక్ష సాక్షుల కథనం.

సాధారణంగా ఎగ్జిబిషన్ లో ఇతర స్టాళ్ల దగ్గర లేని హడావిడి ఫుడ్ స్టాళ్ల దగ్గర కనిపిస్తుంటుంది. ఎగ్జిబిషన్ మొత్తం చూడటానికి గంటల సమయం పడుతుంది. దీంతో అక్కడకు వచ్చే సందర్శకులు.. ఆహార పదార్థాల కోసం ఫుడ్ స్టాళ్ల దగ్గర క్యూ కడుతుంటారు. గిరాకీ ఎక్కువున్న సమయంలో కస్టమర్లకు తొందరగా ఫుడ్ అందించాలనే ఆత్రుతతో గ్యాస్ పొయ్యిల దగ్గర మంట పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో హడావిడితో ఒక్కసారిగా గ్యాస్ పొయ్యి మంట పెంచడం కారణంగా, పక్కనే ఉన్న ఇతర వస్తువులకు అంటుకుని ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదలావుంటే పొయ్యి మీద ఉన్న పాత్రలపై దోసెలు ఇతరత్రా వేసినప్పుడు నూనె చిలకరిస్తుంటారు. ఒకవేళ అలా నూనె చల్లినప్పుడు మంటలు ఎగిసిపడ్డాయా అనేది మరో వాదనగా వినిపిస్తోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయాలు వెలుగుచూసే అవకాశముంది.

ఘన చరిత్ర.. మాయని మచ్చ..!

1937లో ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్ కు విశేషమైన చరిత్ర ఉంది. దీన్నే నుమాయిష్ అని కూడా పిలుస్తారు. వ్యాపారులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెడుతుంటారు. ఫుడ్ ఐటమ్స్ దగ్గర్నుంచి హోమ్ ఇంటీరియర్ వరకు అన్నీ వస్తువులు ఇక్కడ లభిస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ వస్తుంటారు. 80 స్టాళ్లతో మొదలైన ఎగ్జిబిషన్ ప్రస్థానం.. ఈసారి 2,500 స్టాళ్లకు చేరింది. ప్రతి యేటా జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ సందడి 45 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి రోజు దాదాపు 30-50 వేల వరకు సందర్శకులు వస్తుంటారు. వీకెండ్స్, సెలవు దినాల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి అగ్ని ప్రమాదం జరగడం ఆందోళనకు గురిచేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ నుమాయిష్ చరిత్రలో ఇదొక మాయని మచ్చలా మిగిలిపోనుంది. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాని చెబుతున్నారు అధికారులు.

English summary
There is a lot of suspicion behind fire accident in the Hyderabad Nampally Exhibition. There is a short circuit in a bank Stall, who thinks that the cylinders are scary. The Fire Accident in the Expedition of over 2500 Stalls is reported to be over 300 completely burned. Officials believe the property loss could be around Rs 40 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X