హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదీ వాట్సాప్ వర్సిటీ క్యాంపెయన్, కేసీఆర్‌కు రాష్ట్రపతి పదవీపై కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికీ వెళ్లలేదని గుర్తుచేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమన్నది సందర్భాన్ని బట్టి ఉంటుందని, ఆయనకు రాష్ట్రపతి పదవి ఇస్తారన్నది కేవలం వాట్సాప్ వర్సిటీ ప్రచారమేనని స్పష్టంచేశారు.

రాజకీయ సన్యాసం

రాజకీయ సన్యాసం

కొండగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్.. ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ కు ఇవి తొలి ఎన్నికలని, వాటిలో తానేంటో నిరూపించుకునేందుకు హుజూరాబాద్ ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్‌లోకి ఈటలను ఆహ్వానిస్తారని, వివేక్ కూడా వెళ్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని, కానీ, ఆయన మాటకు పార్టీలో లెక్కలేదని, గట్టి అక్రమార్కుల మాటలకే విలువ ఉందని అన్నారు.

సన్నాహక కార్యక్రమాలు

సన్నాహక కార్యక్రమాలు

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు వేగంగా సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేటీఆర్ వివరించారు. నవంబర్ 15న వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు. ఆ రోజు ఆర్టీసీ బస్సులను భారీగా తీసుకుంటామని, ప్రజలెవరూ ఆ రోజున ప్రయాణాలు పెట్టుకోవద్దని కేటీఆర్ సూచించారు. 20 రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తి చేస్తామన్నారు. నీట్ రద్దు విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పూర్తిగా ఏకీభవించలేమని తేల్చి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారని, విద్యార్థులకు మేలైన నిర్ణయమే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. నవంబర్ 15 తర్వాత తమిళనాడు వెళ్లి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నిర్మాణంపై అధ్యయనం చేస్తామని కేటీఆర్ చెప్పారు.

ఎవరినీ వరించేనో

ఎవరినీ వరించేనో

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

బ్రేక్ పడిందిగా..

బ్రేక్ పడిందిగా..

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.

English summary
whatsapp university troll kcr will be president of india minister ktr comment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X