హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు.. 12గంటల్లోనే వీఆర్వోల నుండి దస్త్రాలు వెనక్కు.. కేసీఆర్ మార్క్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ క్యాబినెట్ లో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం తెలుపుతూ , గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో గ్రామ రెవెన్యూ అధికారులకు షాక్ తగిలినట్టైంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఔట్ అన్న చర్చ జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో సీఎం కేసీఆర్ దూకుడు చూపిస్తున్నారు. చాలా కాలం నుండి రెవెన్యూ వ్యవస్థ పై తీవ్రమైన అసహనం తో ఉన్న కేసీఆర్, ఎట్టకేలకు రెవెన్యూ బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో పాటుగా, గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా .. అసెంబ్లీలో ప్రతిపాదిస్తారా ? ఆసక్తికర చర్చ కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా .. అసెంబ్లీలో ప్రతిపాదిస్తారా ? ఆసక్తికర చర్చ

వీఆర్వో ల వద్ద ఉన్న దస్త్రాలను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

వీఆర్వో ల వద్ద ఉన్న దస్త్రాలను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

రెవిన్యూ శాఖ లో అవినీతికి అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని సమూలంగా మార్పులు చేసి సవరిస్తూ రూపొందించిన బిల్లును ఈ నెల 9వ తేదీన శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఇక గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దుకు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని విఆర్వోల వద్ద ఉన్నదస్త్రాలను 12 గంటల వ్యవధిలో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సోమవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులతో విఆర్వోల వద్ద ఉన్న దస్త్రాలన్నింటినీ జిల్లా ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.

10,823 రెవెన్యూ గ్రామాలకు చెందిన భూ రికార్డులు , నకళ్ళు స్వాధీనం

10,823 రెవెన్యూ గ్రామాలకు చెందిన భూ రికార్డులు , నకళ్ళు స్వాధీనం

రాష్ట్ర వ్యాప్తంగా 10,823 రెవెన్యూ గ్రామాలకు చెందిన భూ రికార్డులను ,నకళ్లను తహసీల్దార్లు వీఆర్వోల నుంచి తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇక వీఆర్వో వ్యవస్థలో పని చేస్తున్న వారిని ఇతర శాఖలకు సర్దుబాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టుల మంజూరు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 5,088 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో అర్హులైన వారిని రెవిన్యూలో కొనసాగించాలని, మిగతా వారిని పంచాయితీ రాజ్ తో పాటు ఇతర శాఖల సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

12 గంటల వ్యవధిలోనే దస్త్రాలను వెనక్కు తీసుకున్న అధికారులు

12 గంటల వ్యవధిలోనే దస్త్రాలను వెనక్కు తీసుకున్న అధికారులు

వీఆర్ఓ లందరూ తమ వద్ద ఉన్న రికార్డులను తహసీల్దార్లకు అప్పగించాలని పిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు కలెక్టర్లు రంగంలోకి దిగి తహసీల్దార్లను యుద్ధ ప్రాతిపదికన దస్త్రాలు వెనక్కి తెప్పించాలని ఆదేశించారు. దీంతో తహసిల్దార్ కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి. ఒక 12 గంటల వ్యవధిలోనే విఆర్వో ల నుండి రెవెన్యూ దస్త్రాలను వెనక్కి తీసుకున్నారు జిల్లా అధికార యంత్రాంగం. దీంతో ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు నేపథ్యంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సేవలు కీలకంగా మారనున్నాయి అని భావిస్తున్నారు .

English summary
The government withdrew the files at the VROs in the state within 12 hours in the wake of the decision to abolish the village revenue system. On Monday morning, the district authorities seized all the files at VROs on the orders of Chief secretary Somesh Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X