హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి ఫోటో; ప్రేమ రిజక్ట్‌ చేయడంతో కాల్‌ గర్ల్‌ అంటూ రచ్చ; ఆపై జరిగిందిదే

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ అమ్మాయి ఫోటో చూసిన వ్యక్తి, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తీరా అతని ప్రొఫైల్ బ్లాక్ చేసేసరికి అహం దెబ్బ తిన్న ఆ యువకుడు ఆమెపై కక్ష సాధింపులకు దిగాడు. యువతి ఫోటోతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ సృష్టించి నానా రచ్చ చేశాడు. టెక్నాలజీపై అవగాహన ఉన్న యువతి, అతని ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ చివరికి విధిలేని పరిస్థితులలో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు యువకుడిని అరెస్ట్ చేసి, పోలీసులు బెండు తీశారు.

ఇన్‌స్టాగ్రామ్‌ లో ఫోటో చూసి యువతిపై ప్రేమ, ఆపై రిజెక్ట్ చేసిందని కక్ష

ఇన్‌స్టాగ్రామ్‌ లో ఫోటో చూసి యువతిపై ప్రేమ, ఆపై రిజెక్ట్ చేసిందని కక్ష


ఇంతకీ ఏం జరిగిందంటే కరీంనగర్ జిల్లాకు చెందిన తిరు కోవెల అక్షిత్ కౌండిన్య అనే విద్యార్థి, ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ అమ్మాయి ప్రొఫైల్ చూశాడు. ఆమె ఫోటోను చూసి ఆమెపై ప్రేమ పెంచుకున్న అక్షిత్ కౌండిన్య ఆపై ఆమెకు తరచూ మెసేజ్ లు పంపించేవాడు. అతనిని పట్టించుకోని సదరు యువతి అతని తీరుతో విసిగిపోయింది. అంతే సదరు యువతి అక్షిత్ కౌండిన్య ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ ను బ్లాక్ చేసింది. దీంతో తట్టుకోలేకపోయిన అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు.ఆ యువతి ఫోటోతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచాడు.

నకిలీ ప్రొఫైల్ .. కాల్ గర్ల్ గా చిత్రీకరణ

నకిలీ ప్రొఫైల్ .. కాల్ గర్ల్ గా చిత్రీకరణ

దీంతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపి, ఆమెను కాల్ గర్ల్ గా చిత్రీకరించాడు. రకరకాల అసభ్యకర కామెంట్లు పెడుతూ నానా రచ్చ చేశాడు. దీనిని గుర్తించిన బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌ కు రిపోర్ట్ చేసి తన పేరుతో ఉన్న నకిలీ ఐడిని బ్లాక్ చేయించింది. అతనికి చెక్ పెట్టింది. అయినప్పటికీ వదలని సదరు శాడిస్ట్ యువకుడు మరోమారు ఆమె ఫోటోను వినియోగించి రెండు నకిలీ ఖాతాలను సృష్టించాడు. మరోమారు అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేశాడు. ఈసారి బాధితురాలిని ఆమె తల్లి ని టార్గెట్ చేశాడు.

 వర్చువల్ నంబర్స్ తో యువతికి, ఆమె తల్లికి ఫోన్ కాల్స్ .. బెదిరింపులు

వర్చువల్ నంబర్స్ తో యువతికి, ఆమె తల్లికి ఫోన్ కాల్స్ .. బెదిరింపులు

వర్చువల్ నెంబర్లతో వాట్సాప్ డౌన్లోడ్ చేసి వారికి అసభ్యమైన మెసేజ్ లు, వీడియోలు పంపించాడు. తనకు వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. తాను చెప్పింది చెయ్యాలని, లేకపోతే సదరు యువతి ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారు. ఇక దీంతో విధిలేని పరిస్థితులలో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. అతడు ఫోన్ చేసిన వర్చువల్ నెంబర్లను, అసభ్యకరమైన సందేశాలను పోలీసులకు ఇచ్చి అతనిపై ఫిర్యాదు చేసింది. అతని బారి నుండి తనను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.

Recommended Video

యంగ్ ఇండియా కి బోల్ కార్యక్రమానికి రూపకల్పన చేసిన యూత్ కాంగ్రెస్!! || Oneindia Telugu
 సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు, నిందితుడు అరెస్ట్

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు, నిందితుడు అరెస్ట్

కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు, సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతని వద్ద నుండి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ తరహా సైబర్ నేరాలు నిత్యకృత్యంగా మారుతున్న క్రమంలో అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. సోషల్ మీడియాలో మీ ఫోటోలను పోస్ట్ చేసే ముందు, సెక్యూరిటీ లాక్ తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఖాతాలను చెక్ చేస్తున్న కొత్త వ్యక్తుల పై ఏమాత్రం అనుమానం ఉన్నా జాగ్రత్తగా వ్యవహరించండి అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. వీలైతే ఫోటోలు పెట్టకుండానే జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. సోషల్ మీడియా వాడుతున్న వారు దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అంటున్నారు.

English summary
young man portrayed a young woman as call girl with Instagram fake profiles. The young woman has blocked the profile of the young man and rejected his love. Police have arrested accused who created fake profiles of her as 'call girl' after rejecting him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X