గర్భా ఆడుతూ.. గుండెపోటుతో పదిమంది మృతి...
డ్యాన్స్ చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. అందుకే చాలామంది ఉదయం, సాయంత్రం డ్యాన్స్ చేస్తూ ఉంటారు. బరువు తగ్గాలన్నా చాలామంది డ్యాన్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇప్పడు పరిస్థితి అలా లేదు. డ్యాన్స్ చేస్తూ చేస్తూ చాలామంది కుప్పకూలిపోతున్నారు. ఏమయిందోనని తేరుకుని చూడగానే గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇప్పుడు దసరా ఉత్సవాల్లో భాగంగా కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా, దాండియా నృత్యాలు చేయడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీ చాలామంది ప్రాణాలను బలిగింది.
గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. ఈ వార్త ఇప్పుడు అందరిని కలిచివేస్తుంది. గడచిన 24 గంటల్లో ఏకంగా పదిమంది గర్బా ఆడుతూ గుండెపోటుతో మృతి చెందారు. చనిపోయిన బాధితుల్లో ఎక్కువ మంది యువత, మధ్యవయసు వారే కావడం విశేషం. మరణించినవారిలో బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇంత చిన్నాపిల్లవాడికి గుండెపోటు రావడం ఎంటని అందరు విస్మయానికి గురవుతున్నారు.

ఇంతకుముందు ఇలాంటివి చాలా జరిగాయి: ఇవే కాదు. ఇంతకుముందు చాలాసందర్భాల్లో వినాయక నిమజ్జనం సందర్భంలో చాలామంది డ్యాన్సులు చేస్తూ గుండెపోటుతో మరణించారు. అలాగే పెళ్లిళ్లు, ఇతర పార్టీల్లో నృత్యాలు చేస్తూ గుండెపోటుతో మరణించడం ఈ మధ్యకాలంలో మనం చాలానే చూశాం. ఈ వార్తలు, వీడియోలు కూడా సోషల్‌మీడియాలో ఈ మధ్య తెగ వైరల్ అయ్యాయి.

గుండె సంబంధిత సమస్యలు వెయ్యి కాల్స్: గత కొన్ని రోజుల నుంచి దేశంలో ఇలాంటి కేసులు వరుసగా నమోదవుతున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి, అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అలాగే, కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదాలతో అలర్టయిన ప్రభుత్వం గర్బా వేదికల వద్దకు అంబులెన్స్‌లు వేగంగా ప్రవేశించేలా కారిడార్‌లను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నవరాత్రుల సందర్భంగా గడిచిన ఆరు రోజుల్లో గుజరాత్ వంటి ప్రదేశాల్లో 108 అంబులెన్స్ సర్వీసులకు గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి 1000 కాల్స్ వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు అయితే సుమారు 609 కాల్స్ వచ్చాయని అధికారులు అంటున్నారు. అవి కూడా గర్బా వేడుకలు జరిగే సమయం సాయంత్రం ఆరు నుంచి తెల్లవారుజామును రెండుగంటల మధ్యలోనే ఈ కాల్చ్ వచ్చాయంటున్నారు అధికారులు.












Click it and Unblock the Notifications