వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెల్టా కన్నా డేంజర్ కొత్త వేరియంట్.. అప్రమత్తత కంపల్సరీ అంటున్న సైంటిస్టులు

|
Google Oneindia TeluguNews

కొత్త కరోనా వేరియంట్ భయపెడుతుంది. ఇదీ డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. దీని ఉత్పరివర్తనాల జాబితా చాలా పెద్దదేదని, చాలా భయంకరమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం చూసిన వేరియంట్లలో ఇదే అత్యంత ఘోరమైనదని చెబుతున్నారు. దీని వ్యాప్తి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దక్షిణాఫ్రికాలోని ఒక ప్రాంతంలో మాత్రమే ఈ కేసులు బయటపడ్డాయి.

కొత్త వేరియంట్‌ను B.1.1.529 అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించడం ముఖ్యం.

10 Things To Know About New Strain That May Be More Infectious Than Delta

ప్రయోగశాలలో శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయి. కానీ, వాస్తవ ప్రపంచంలో వైరస్‌ను పర్యవేక్షించడం ద్వారా జవాబులు మరింత త్వరగా వస్తాయి. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఆందోళనలకు కారణమయ్యే అంశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో 77 కేసులు, బోట్స్వానాలో నాలుగు కేసులు, హాంకాంగ్‌లో ఒకటి (సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి) బయటపడ్డాయి. వీరందరికీ కొత్త వేరియంట్ కారణంగానే కోవిడ్ సోకినట్లు స్పష్టమైంది.

Recommended Video

Germany: Pilots Return To Work To Cover Tourism Demand

ఇంత కన్నా వేగంగానే ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణ పరీక్షల్లో ఈ వైరస్ చిత్రమైన ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల గౌటెంగ్ ప్రాంతంలో 90 శాతం కేసులు ఇదే వేరియంట్ వల్ల కావొచ్చు. దక్షిణాఫ్రికాలోని "ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాప్తి" చెంది ఉండవచ్చు. అయితే, ఇది డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందా, అంతకన్నా తీవ్రమైనదా, వ్యాక్సీన్ల ద్వారా పొందిన రక్షణ వ్యవస్థను తప్పించుకుంటుందా అనే అంశాలు స్పష్టంగా తెలియలేదు.

English summary
New Covid Strain: On Thursday the Union Health Ministry called for rigorous screening of passengers from South Africa, Botswana and Hong Kong, as well as their contacts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X