ఈ ఏడాది జొమాటో ఆర్డర్లలో టాప్ ఐఐటీలు..! ఒక్క క్యాంపస్ లోనే 2.4 లక్షలు..!
మన దేశంలో ఫుడ్ డెలివరీ యాప్ ల హవా ఈ ఏడాది కూడా కొనసాగింది. ఇప్పటికే ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లకు తోడు కొత్త యాప్ లు కూడా పుట్టుకొచ్చాయి. అలాగే ఈ ఏడాది పుడ్ డెలివరీ యాప్ లకు ఐఐటీ క్యాంపస్ ల ఆదరణ కూడా బాగా పెరిగింది. ఇదే క్రమంలో ఐఐటీలకు తాము డెలివరీ చేసిన ఆర్డర్ల వివరాలను ఫుడ్ యాప్ జొమాటో ప్రకటించింది. ఇందులో టాప్ ఐఐటీలు ఉండటం విశేషం.
ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కంపెనీ తాజాగా 2025లో టాప్ పర్ ఫార్మర్ల జాబితా విడుదల చేసింది. డిసెంబర్ 28 వరకు ఉన్న డేటా ఆధారంగా తమ ప్లాట్‌ఫామ్‌పై ఆర్డర్‌లను ప్రభావితం చేసిన ప్రదేశాలు, సమయాలు, పండుగలు వంటి వివిధ అంశాలపై గణాంకాలు విడుదల చేసింది. ఉదాహరణకు ఈ సంవత్సరం అత్యధిక జొమాటో ఆర్డర్‌లతో ఐఐటీ ఖరగ్‌పూర్ టాప్ లో నిలిచింది. ఈ ఐఐటీలో విద్యార్థులు 2025లో 2.4 లక్షల ఆర్డర్‌లు చేశారని కంపెనీ పేర్కొంది.

అలాగే ఐఐటీ వారణాసి 1.8 లక్షలు , ఐఐటీ బాంబే 1.6 లక్షల ఆర్డర్‌లతో రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. జొమాటో ఇతర లొకేషన్-సంబంధిత టాపర్‌ల విషయానికొస్తే.. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్‌లో 1.4 లక్షల ఆర్డర్‌లు జరిగాయి. నగరాల వారీగా ఆర్డర్ల పంపిణీ పరంగా, ఢిల్లీ అగ్రస్ధానంలో నిలిచింది, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ రాజధాని ఆర్డర్ల సంఖ్య ఇతర నగరాల కంటే పది లక్షల కంటే ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో యూఏఈ నుండి 2.3 లక్షల ఆర్డర్లు వచ్చాయి. అయితే 1.2 లక్షలు అమెరికా నుండి వచ్చాయంట. తాజాగా మరో ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ కూడా తన వార్షిక నివేదికను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications