మైనర్ పై రేప్: ఎంఎల్ఏకి బెయిల్ మంజూరు
పనాజీ:మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గోవాలోని సెయింట్ క్రూజ్ ఎంఎల్ఏ అటానాసియో మోన్సిరేట్ కు గోవా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక చిల్డ్రన్స్ కోర్టు అటానాసియో మోన్సిరేట్ తో పాటు మరో ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
లక్ష రూపాయల పూచికత్తుతో పాటు వారం రోజుల పాటు ప్రతి రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చెయ్యాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా గోవా వదిలి ఎక్కడికి వెళ్లరాదని, పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

గత ఏడాది మార్చి నెలలో కనిపించకుండా పోయిన ఓ బాలిక ఇటీవలే పోలీసుల గాలింపులో దొరికింది. ఆ బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరించగా తన మీద ఎంఎల్ఏ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక విలపించింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు శాసన సభ్యుడు మోన్సిరేట్ మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పెద్దలు విషయం తెలుసుకుని మోన్సిరేట్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే తన మీద లేని పోని అపవాదులు వేస్తూ బురదచల్లి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని, తన రాజకీయ జీవితానికి ఆటంకం కలిగిస్తున్నారని శాసన సభ్యముడు మోన్సిరేట్ అంటున్నారు.












Click it and Unblock the Notifications