కోపంతో.. పాముని కరచిన మనిషి, అనంతరం మృతి!

సాధారణంగా పాములు మనుష్యులను కరచి వెళ్లిపోతుంటాయి. వాటిని పట్టుకోవడం కూడ ఓక్కోసారి కష్టసాధ్యమవుతుంది. కాని ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తనను కరిచిన విషపు పాముని ఓ వ్యక్తి పట్టుకున్నాడు. అనంతరం దాన్ని నోటితో కొరికి చంపాడు. ఆసుపత్రిలో చేరి తన ప్రాణం పోగొట్టుకున్నాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పాము కరచిన వ్యక్తి కోపంతో రెచ్చి పోయాడు. తననే కరుస్తావా అంటూ...పామును పట్టుకున్నాడు. దాన్ని కొరికి చంపాడు అనంతరం దాన్ని తినే ప్రయత్నం కూడ చేశాడు. అతని చేష్టలు చూసిన బంధువులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. పాముని కాల్చివేశారు. విషపు పాము కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న నాలుగైదు గంటల్లోనే ప్రాణాలు విడిచాడు.

a man bites snake after it bit him, and dies

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిసాగర్ జిల్లాలోని అజన్వా అనే గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. పర్వత్ గాళ బరియా అనే 70 ఏళ్ల రైతు తన గ్రామం నుండి గోద్రాకు వెళ్లే దారిలో అయనను ఓ పాము కరిచింది. దీంతో బరియా మాత్రం అక్కడి నుండి పారిపోకుండా పాము వెంట పడ్డాడు. పామును పట్టుకుని కసితీరా కొరికాడు. కొరకడమే కాకుండా దాన్ని తినేందుకు కూడ ప్రయత్నించాడు. దీంతో బరియా చేష్టలను గమనించిన బంధువులు వెంటనే ఆయన్ను ప్రాధమిక చికిత్స కోసం లున్‌వాడ ప్రభుత్వ ఆసుపత్రికి , అనంతరం మెరుగైన చికిత్స కొసం గోద్రాలోని సివిల్ ఆసుపత్రికి తరలించామని బరియా కోడలు మీడియాతో తెలిపింది. కాగా ఆసుపత్రిలో చేరిన నాలుగు గంటల తర్వాత బరియా మెలికలు తిరుగుతూ చనిపోయారని ఆమే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+