
Viral Video: కదులుతున్న ట్రక్కుపై యువకుడి విన్యాసాలు.. చివరికి ఏమైందంటే.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
సోషల్ మీడియా వచ్చి నుంచి నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇలా ఓ వ్యక్తి కదులుతున్న ట్రక్కుపై పుషప్స్ చేస్తూ కనిపించాడు. అతను ఏ మాత్రం భయం లేకుండా వ్యాయామం చేస్తున్నాడు. కానీ చివరికి ఏమైందో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు. యూపీలోని లక్నోలోని గోమతీనగర్‌లో కదులుతున్న చెత్త ట్రక్కు పైన ఒక యువకుడు పుష్ చేస్తూ కనిపించాడు.
అయితే అతను అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి నేరుగా రోడ్డుపై పడిపోయాడు. వెనక నుంచి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మొత్తం ఘటనను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత గోమతినగర్ అదనపు పోలీసు కమిషనర్ శ్వేతా శ్రీవాస్తవ ఈ ఫుటేజీని విడుదల చేశారు. అనవసరమైన సాహసం చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన శ్వేతా శ్రీవాస్తవ, 'శక్తిమాన్‌గా ఉండకండి, బుద్ధిమాన్ (తెలివిగా) ఉండండి' అని అన్నారు. 'శక్తిమాన్‌గా మారాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ ఇప్పుడు కొన్ని రోజులు కూర్చోలేడు' అని శ్వేతా శ్రీవాస్తవ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాహనంపై నుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందంచారు. "మీ ఇష్టాల కంటే మీ జీవితం చాలా ముఖ్యం" అని ఒకరు బదులిచ్చారు. ప్రతి ఒక్కరు కుటుంబం గురించి ఆలోచించాలని మరొకరు కామెంట్ చేశారు.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ