న్యూ ఇయర్ షాక్, పార్క్ లో నగ్నంగా చుక్కలు చూపించిన యువకుడు, కళ్లు మూసుకుని పరుగో పరుగు!
బెంగళూరు: నూతన సంవత్సరం రోజు స్థానికులకు ఓ యువకుడు షాక్ ఇచ్చాడు. ఉదయం దేవుడి ముఖం చూసి ఈ సంవత్సరం పూర్తిగా మాకు అంతా మంచే జరగాలని దేవుడికి నమస్కారం చేసి పార్క్ లో వాకింగ్ చెయ్యడానికి వెళ్లిన స్థానికులు నగ్నంగా గోమఠేశ్వరస్వామిని తలపిస్తూ ఓ యువకుడు దర్శనం ఇచ్చి సినిమా చూపించడంతో స్థానికులు షాక్ కు గురైనారు. కళ్లు మూసుకున్న మహిళలు, అమ్మాయిలు అక్కడి నుంచి పరుగు తీశారు.

పార్క్ లో వాకింగ్
కర్ణాటకలోని విజయపుర పట్టణంలోని ప్రసిద్ది చెందిన పార్క్ లో స్థానికులు ఉదయం, సాయంత్రం వాకింగ్, జాగింగ్ చేస్తూ వ్యాయామం చేస్తుంటారు. నూతన సంవత్సరం రోజు బుధవారం ఉదయం ఎప్పటిలాగే ఇంటిలోని దేవుడికి నమస్కారం చేసి ఈ సంవత్సరం మాకు అంతా మంచే జరగాలని దేవుడికి ముక్కుకుని పార్క్ దగ్గరకు వెళ్లారు.

కలెక్టర్ ఆఫీస్ పక్కనే!
విజయపుర పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ప్రసిద్ది చెందిన పార్క్ లో బుధవారం ఉదయం వాకింగ్ చెయ్యడానికి వెళ్లిన స్థానికులకు ఓ యువకుడు నగ్నంగా దర్శనం ఇచ్చాడు. వాకింగ్ చెయ్యడానికి వచ్చిన యువకుడి ఒంటి మీద నూలుపోగు కూడా లేదు.

నగ్నంగా డ్యాన్స్
వాకింగ్ చెయ్యడానికి వచ్చిన స్థానికులను చూసిన యువకుడు మరింత రెచ్చిపోయాడు. పార్క్ లో అటూ ఇటూ తిరుగుతూ డ్యాన్స్ లు చేస్తున్న యువకుడిని చూసిన మహిళలు, ఆడపిల్లలు అక్కడి నుంచి పరుగు తీశారు. ఉదయం యువకుడి హంగామాతో పార్క్ లోకి వెళ్లిన స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పరుగో పరుగు
యువకుడి తిక్కచేష్టలు చూసిన మహిళలు, అమ్మాయిలు కళ్లు మూసుకుని అక్కడి నుంచి పరుగు తీశారు. కొంత మంది అతన్ని దుస్తులు వేసుకోవాలని వారి దగ్గర ఉన్న జర్కిన్లు, కొన్ని బట్టలు ఇచ్చినా ఆ యువకుడు మాత్రం వాటిని వేసుకోలేదు. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

క్లైమాక్స్ లో పోలీసులు ఎంట్రీ!
సినిమాల్లో లాగా పోలీసులు క్రైమాక్స్ లో పార్క్ దగ్గరకు రావడంతో అప్పటికే ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. న్యూ ఇయర్ సందర్బంగా పీకలదాక మద్యం సేవించిన యువకుడు స్థానికులను ఇలా ఇబ్బంది పెట్టి ఉంటాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఆ యువకుడు మద్యం మత్తులో ఇలా చేశాడా ? లేక కావాలనే ఇలా చేశాడా ? అంటూ స్థానికులు ఆరా తీయ్యడం మొదలు పెట్టారు. మొత్తం మీద నూతన సంవత్సరం ప్రారంభం రోజే ఆ యువకుడు షాక్ ఇవ్వడంతో స్థానికులు హడలిపోయాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications