నేరస్థునితో ఇన్‌స్పెక్టర్ సెల్ఫీ...! ఫలితం అనుభవించాడు
పోలీసులంటే నేరగాళ్లకు ,సంఘవ్యతిరేక శక్తులకు హడల్ ఎత్తాలి. నేరాలు చేసినవారు లేదా ఆరోపణలు ఎదుర్కోంటున్నవారు ఎంత పెద్ద రాజకీయ నాయకులైన, లేదా సెలబ్రెటిలు అయినా.. వారిని నేరగాళ్లుగానే చూడాల్సి ఉంటుంది. కాని ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఇందుకు విరుద్దంగా వ్వహరించారు. సెల్ఫీ మోజులో పడి ఉద్యోగ ధర్మాన్ని మరిచారు. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఓ నాయకున్ని తానే స్వయంగా ఆరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సంధర్భంలో పక్కనే కూర్చుని నిందితునితో సెల్ఫీ దిగాడు. అంతే కాకుండా దాన్ని సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు. దీంతో ఫోటో వైరల్ కావడంతో ఇన్‌స్పెక్టర్‌ను జిల్లా ఉన్నతాధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు.
వివరాల్లోకి వెళితే ఓడిశా రాష్ట్రంలోని పూరీకి సమీపంలోని ఆస్ట్రాంగా అనే ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఉన్న శతృత్వంతో మున్నా అనే వ్యక్తి ఓ తండ్రిముందే తన కొడుకును ఆక్టోబర్ 5న హత్య చేశాడు. దీంతో మున్నాను స్థానిక చంద్రబంగా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ బాలు ముండా అరెస్ట్ చేశాడు. అనంతరం తన పోలీసు వాహనంలో తీసుకుని స్టేషన్‌కు బయలుదేరాడు.

నిందితున్ని ఇద్దరి మధ్యలో కర్చోపెట్టుకున్న అనంతరం ఇన్‌స్పెక్టర్ ముండా, నిందితునితో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. కాగా సెల్ఫీ తీసుకున్న సమయంలో నిందితుడు మున్నా టిప్పుటాప్‌గా ఉన్నాడు. కళ్లకు గ్లాస్‌పెట్టుకుని దర్జాగా ఫోజిచ్చాడు. ఇక సెల్ఫీ తీసుకున్న ఫోటోను అరెస్ట్ చేశామని చెప్పుకోవడానికో లేక మున్నా మీద అభిమానంతో తెలియదు కాని ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
దీంతో హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ఓ ఇన్‌స్పెక్టర్ సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడీయాలో వైరల్‌గా మారింది. మరోవైపు నిందితునికి బేడీలు కూడ లేకుండా స్టేషన్‌కు తీసుకురావడం కూడ అనేక విమర్శలు తెరలేపింది. దీంతో విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఇన్‌స్పెక్టర్ బాలు ముండాను జిల్లా పోలీస్ కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications