Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటెలిజెన్స్ నివేదికతో అంబరీష్ అంత్యక్రియలకు నటి రమ్య రాలేదంట, దాడి చేస్తారని, మంత్రి బ్యాటింగ్!

న్యూఢిల్లీ/బెంగళూరు: రెబల్ స్టార్ అంబరీష్ అంత్యక్రియలకు బహుబాష నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ ఎందుకు రాలేదు ? అనే విషయంపై రోజుకో చర్చ తెరమీదకు వస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో నటి రమ్యా అంబరీష్ అంత్యక్రియలల్లో పాల్గోనలేదని బుధవారం మరో చర్చ మొదలైయ్యింది. రమ్యా మీద దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజన్స్ అధికారులు పసిగట్టారని ప్రచారం మొదలైయ్యింది. అయితే అంబరీష్ అంత్యక్రియలకు రమ్యా ఎందుకు హాజరుకాలేదు అనే అసలు విషయం మాత్రం ఇంకా బయటకురాలేదు.

అనారోగ్య సమస్య

అనారోగ్య సమస్య

కొంత కొలం క్రితం జరిగిన చిన్న ప్రమాదంలో తన కాలుకు గాయం అయ్యిందని, నడవడానికి ఇబ్బందిగా ఉందని, చికిత్స చేయించుకుంటున్నానని నటి రమ్యా అక్టోబర్ 19వ తేదీ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేసింది. అంబరీష్ అంత్యక్రియలకు అనారోగ్యం కారణంగానే రమ్యా హాజరుకాలేదని ఆమె మద్దతుదారులు అంటున్నారు.

విమాన టిక్కెట్లు

విమాన టిక్కెట్లు

అంబరీష్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడితో కలిసి ఢిల్లీ నుంచి బెంగళూరు రావడానికి విమాన టిక్కెట్లు రమ్యా కొనుగోలు చేశారని, ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికతో చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారని ఆమె మద్దతుదారులు అంటున్నారు.

ఇంటెలిజెన్స్ నివేదిక

ఇంటెలిజెన్స్ నివేదిక

రాజకీయ భిక్షపెట్టి ఎంపీగా గెలిపించిన అంబరీష్ విషయంలో నటి రమ్యా నిర్లక్షం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 2014 లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన రమ్యా అంబరీష్ తో పాటు ఆ జిల్లా నాయకుల పట్ల ప్రవర్తించిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి సందర్బంలో అంబరీష్ అంత్యక్రియలకు రమ్యా హాజరైతే ఆమె మీద దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయని, అందుకే ఆమె చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారని చర్చ జరుగుతోంది.

మంత్రి బ్యాటింగ్

మంత్రి బ్యాటింగ్

అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకావాలని తానే స్వయంగా రమ్యాకు ఫోన్ చేశానని మంత్రి డీకే. శికుమార్ అంటున్నారు. తనకు అనారోగ్యంగా ఉందని, నడవలేని స్థితిలో ఉన్నందున రాలేనని రమ్యా సమాధానం ఇచ్చిందని, దీన్ని వేరేవిధంగా ఊహించుకోరాదని మంత్రి డీకే. శివకుమార్ రెండు రోజుల క్రితం మీడియాకు చెప్పారు.

ఏది నిజం అంటున్న ఫ్యాన్స్

ఏది నిజం అంటున్న ఫ్యాన్స్

అంబరీష్ అంత్యక్రియలకు రమ్యా ఎందుకు హాజరుకాలేదు అనే విషయంపై వస్తున్న వార్తల్లో ఏది నిజం అంటూ రెబల్ స్టార్ అంబరీష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రెబల్ స్టార్, రమ్యా అభిమానులు మధ్య అనేకరకాల చర్చ మొదలైయ్యింది. అంబరీష్ విషయంలో రమ్యా ప్రవర్తించిన తీరుతో ఆమె మీద దాడి జరిగినా జరిగే అవకాశం ఉండేదని కొందరు అంటున్నారు. ఢిల్లీలో మంచి పదవి చిక్కడంతో రమ్యాకు అహంకారం పెరిగిపోయిందని కోందరు అంటున్నారు. మొత్తం మీద ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో అనే విషయం అంతుచిక్కడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+