పైకి ప్లాస్టిక్ వ్యాపారం, లోపల మాత్రం ?, రూ. కోట్లలో సంపాధిస్తున్న వ్యాపారి అందర్ !
బెంగళూరు/జైపూర్: కర్ణాటక రాజధానిలో అఫీసు (గసగసాల పొడితో తయారు చేసిన డ్రగ్స) విక్రయిస్తున్న వ్యాపారిని బెంగళూరులోని వీవీపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓకళిపరంలో నివాసం ఉంటున్న గుల్మార్ సింగ్ అలియాస్ ఆఫీమ్ సింగ్ అనే ప్లాస్టిక్ వ్యాపారిని అరెస్టు చేశారు. నిందితుడు సింగ్ ను రూ. 60 లక్షల విలువైన 55 కిలోల ఆఫీము స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు సమాచారం అందింది.
ఇదే సమమాచారంతో ఇన్‌స్పెక్టర్ మీర్జా అలీ నేతృత్వంలోని బృందం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొన్నాళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన గుల్మార్ సింగ్ కేఆర్ మార్కెట్ సమీపంలో ప్లాస్టిక్ దుకాణం పెట్టుకున్నాడు. కొంత కాలంగా సులువుగా సొమ్ము చేసుకునేందుకు గల్మార్ సింగ్ పక్కదారి పట్టాడు.

రాజస్థాన్ లోని సొంత ఊరిలోని మందుబాబులు, డ్రగ్స్ సేవించే వారిద్వారా తక్కువ ధరకు ఆఫీము కొనుగోలు చేసి బెంగళూరు నగరానికి తీసుకు వచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నాడు. నిందితుడు గుల్మార్ సింగ్ బస్సులో కొరియర్ ద్వారా ఆఫీము బెంగళూరుకు రవాణా చేస్తున్నాడని పోలీసులు అన్నారు. గుల్మార్ సింగ్ ఆఫీము విక్రయిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడని సమాచారం అందడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ రాష్ట్రం ఆఫీము అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. గసగసాల గడ్డి, నల్లమందు మొక్కల నుండి తయారైన మత్తు పదార్థం ఇది. పచ్చి నల్లమందు మొక్కల నుండి రసాన్ని సేకరించి ఎండలో ఆరబెట్టాలి. అది ఆరిపోయి గట్టిపడిన తర్వాత రాత్రిపూట నీటిలో నానబెట్టిన నల్లమందుగా కరిగి ద్రవంగా మారుతుందని పోలీసులు అంటున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలో గసగసాల గడ్డిని విరివిగా ఉపయోగిస్తారు. ఆ రాష్ట్రంలో పెళ్లిళ్లు, విందులు సహా పలు కార్యక్రమాల్లో అతిథులను స్వాగతించడానికి ఈ మందులు కలిపిన శీతల పానీయాన్ని అందించడం సర్వసాధారణం. నగరంలో నివసిస్తున్న రాజస్థాన్ మూలాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని గుల్మార్ సింగ్ ఈ ఆఫీము రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications