Viral Video: బైక్‍పై రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో చూస్తే ముక్కున వేలెసుకోవాల్సిందే..!
ఈ మధ్య కొందరు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలా పనులు చేస్తున్నారు. ముఖ్యంగా లవర్స్ అయితే బండిపై వెళ్తూ ముద్దులు పెట్టుకుంటున్నారు. అమ్మాయిని బైక్ ట్యాంకర్ పై కూర్చోబెట్టుకుని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలు గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమ్మాయి, అబ్బాయి బైక్ పై ముద్దులు పెట్టుకోవడం కామన్ అనుకున్నారేమో.. ఈసారి కొత్తగా ట్రై చేశారు. ఈసారి అమ్మాయిని మరో అమ్మాయి ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్ వెళ్తున్నారు. ఒక అమ్మాయి బైక్ పై సరిగా కూర్చుని బండి నడుపుతుంది. మరో అమ్మాయి బైక్ ట్యాంక్ పై కూర్చుంది. వారు బైక్ హ్యాండిల్ విడిచి పెట్టి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. తర్వాత కౌగిలించుకున్నారు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. స్టార్ ఆఫ్ జార్ఘండ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 29 వేలకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే కింద పడిపోతారని ఒకరు కామెంట్ చేశారు.

ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, 'సోదరా, జార్ఖండ్ పోలీసులను ట్యాగ్ చేయడం ద్వారా ట్వీట్ చేయండి' అని రాశారు. మరొకరు, 'అందుకే మేము అబ్బాయిలు ఒంటరిగా ఉన్నాము ఈ రోజు తెలిసింది' అని రాశారు. ఈ వీడియో ఎక్కడ తీశారు.. ఈ వీడియోలో ఉంది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోడ్ లో ఓ ప్రేమ జంట హల్ చల్ చేసింది. అందరు ఉన్నారనే విషయం మరచిపోయి బైక్ పైనే ముద్దులు పెట్టాకున్నారు.
అబ్బాయి ద్విచక్ర వాహనం నడుపుతుంటే అమ్మాయి ట్యాంకు మీద కూర్చుని అబ్బాయిని కౌగిలించుకుంది. బైక్ పై వెళ్తూ ముద్దులు, హగ్గులు చేసుకున్నారు. వీరిని వెనక వాహనంలో వచ్చే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతీ ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు అమ్మాయి, అబ్బాయిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.












Click it and Unblock the Notifications