Viral Video: ఢిల్లీ మెట్రో రైలులో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..
మనం సాధారణంగా బస్సుల్లో, ట్రైన్లలో సీట్ కోసం గొడవ పడుతుంటారు. పురుషులైత గొడవపడి ఊరుకుంటారు. కానీ మహిళలు అయితే.. ఏం చేస్తారు.. కొట్టుకుంటారు. అవును ఇలా చాలా సంఘటనలు జరిగాయి. తాజాగా మెట్రో రైలులో ఇద్దురు మహిళలు గర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి కొట్టుకోవడం చూస్తే భయం వేస్తుంది.
Kalesh b/w Two Woman inside Delhi metro over not giving place to stand pic.twitter.com/8a11cfg1Hz
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 15, 2023
ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు మహిళలు ఎక్కారు. అయితే అప్పటికే మిగతా వారితో మెట్రో నిండిపోయింది. నిలబడేందుకు అవకాశం లేదు. ఈ క్రమంలో ఓ మహిళ మరో మహిళను కాస్త ముందుకెళ్లండి అని అడిగింది. కానీ సదరు మహిళ తాను నిలబడడానికే ప్లెస్ లేదు ఎక్కడి వెళ్లాలి అని కోపంగా అరిచింది. దీనిపై ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. వాగ్వాదం జరిగింది.

సహనం కోల్పోయిన వారు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఆ తర్వాత కొట్టుకున్నారు. వీరు కొట్టుకుంటున్నప్పుడు అదే ట్రైన్ ప్రయాణం చేస్తున్న మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోకు ఎక్స్ (ట్విట్టర్) లో భారీగా వ్యూస్ వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.
Just Delhi Metro & Women !!!#W0men !!#DelhiMetro
— The DV Warrior (Parody) (@BakraofDv) August 3, 2023
😂😂😂 pic.twitter.com/BRjVJTQkJ7
గతంలో కూడా ఢిల్లీ మెట్రోలో మహిళలు కొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. ట్రైన్ లో ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు గొడవ పడుతుంటే మరో మహిళ వారించే ప్రయత్నం చేశారు. కానీ వారు వినకుండా కొట్టుకున్నారు.












Click it and Unblock the Notifications