Raghav Chadha: మోడీని వదిలేసి సమోసా రేట్లపై ప్రశ్నలా? రాఘవ్ చద్దాకు ఆప్ కౌంటర్ ..!
ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో సామాన్యుల సమస్యలపై వరుసగా ప్రశ్నలు అడుగుతూ పేదల ఎంపీగా పాపులారిటీ సంపాదించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా(raghav chadha)పై ఆయన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మాత్రం మండిపడుతోంది. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటూ పార్లమెంట్ లో సొంత అజెండాతో ప్రశ్నలు అడుగుతున్న ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి కూడా తప్పించింది.
దీంతో తాను చేసిన తప్పేంటని ప్రశ్నిస్తూ రాఘవ్ చద్దా ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. తనను డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించడమే కాకుండా, ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వొద్దంటూ ఛైర్మన్ కు సూచించడాన్ని తప్పుబడుతూ ఆయన ఈ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో కానీ తనను ఓడించలేరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలు లేవనెత్తడం కూడా నేరమా అని చద్దా ప్రశ్నించారు.

దీంతో ఇరుకున పడిన ఆయన సొంత పార్టీ ఆప్.. ఎట్టకేలకు బహిరంగంగా స్పందించింది. పార్లమెంట్ లో ప్రదాని మోడీపై ప్రశ్నలు అడక్కుండా భయపడుతున్న రాఘవ్ చద్దా.. సమోసా రేట్లపై ప్రశ్నలు అడగటం ఏంటని నిలదీసింది. ఈ మేరకు ఆప్ జాతీయ మీడియా ఛీఫ్ అనురాగ్ ధండా ప్రశ్నించారు. "గత కొన్నేళ్లుగా నువ్వు భయపడుతున్నావు, రాఘవ్. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నావు. దేశపు నిజమైన సమస్యలను లేవనెత్తడానికి భయపడుతున్నావు," అని పార్టీ శ్రేణుల్లో ఆయనపై తీవ్రమవుతున్న అసంతృప్తిని ఆయన వెల్లడించారు.
తమ పార్టీ నిర్భయత్వానికి అండగా నిలుస్తుందన్న ఆయన..కీలక సమస్యలపై చద్ధా మౌనాన్ని ప్రశ్నించారు.తాము అరవింద్ కేజ్రీవాల్ సైనికులమని, నిర్భయత్వమే తమ ప్రాథమిక గుర్తింపు అని తెలిపారు. నరేంద్ర మోడీకి భయపడితే, దేశం కోసం పోరాడగలరా?" అని ఆయన ప్రశ్నించారు .పార్లమెంట్ లో పార్టీకి మాట్లాడటానికి పరిమిత సమయం లభిస్తుందని, దానిని కీలక జాతీయ సమస్యలను లేవనెత్తడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఆ సమయంలో, మనం దేశాన్ని కాపాడటానికి పోరాడటమో లేదా విమానాశ్రయ క్యాంటీన్లలో సమోసాల ధరలను తగ్గించడం గురించి మాట్లాడటమా ఆలోచించాలన్నారు.
గుజరాత్‌లో ఆప్ కార్యకర్తలను అరెస్టు చేసినప్పటికీ చద్దా ఆ విషయాన్ని సభలో లేవనెత్తలేదని ధండా గుర్తుచేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, చద్దా దానిపై సంతకం చేయడానికి నిరాకరించారన్నారు.
-
టీ తోటల్లో ప్రధాని మోదీ- అట్నుంచి నరుక్కొస్తున్నారు మరి -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..















Click it and Unblock the Notifications