Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాతీయ పార్టీగా ఆప్-ఆదుకున్న గుజరాత్-కేజ్రివాల్ కోరుకుంది ఇదేనా ?

ఢిల్లీ, పంజాబ్ లో వరుస విజయాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాజాగా జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు షాకిచ్చాయి. గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఆప్ .. చివరికి ఆరుసీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఖాతా కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆప్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక చోట ఆరుశాతం ఓట్లు, రెండు సీట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అవతరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుసీట్లు సాధించి ఆరుశాతం ఓట్లు కూడా సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, గోవాతో పాటు గుజరాత్ లో కనీసం ఆరుశాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీ అయ్యేందుకు అర్హత సాధించినట్లయింది. దీంతో గుజరాత్ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనను మరిపిస్తూ జాతీయ పార్టీ అయ్యే అవకాశం ఆప్ తలుపు తట్టినట్లయింది.

 aap to become national party with gujarat votes despite bitter performance

గుజరాత్ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా ఇవాళ ప్రకటించారు. తొలిసారి విద్య, ఆరోగ్యంపై ఆధారపడిన రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

 aap to become national party with gujarat votes despite bitter performance
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే సిసోడియా ఈ ట్వీట్ చేశారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో ఆప్ .. బీజేపీ, కాంగ్రెస్‌ల కంటే చాలా వెనుకబడినప్పటికీ ఎనిమిది స్థానాల్లో మాత్రం ఆధిక్యంలో ఉంది. జాతీయ పార్టీగా అవతరించడానికి ఆప్ కు రెండు సీట్లు , 6% సీట్లు గెల్చుకోవాల్సి ఉంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+