షాక్: మాంధ్యం, ఆటోమెషన్ తో ఉద్యోగాల్లో కోత, 11 లక్షల టెక్కీలపై ప్రభావం?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కొంతకాలంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.ఏ రోజూ ఏ రూపంలో ఉద్యోగం కోల్పోయే ముప్పు ముంచుకొస్తోందోననే భయం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో నెలకొంది. అయితే ఆటోమేషన్ ప్రభావం, ఐటీ రంగంలో మాంద్యం పెరిగిపోవడం తదితర కారణాలనీ నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో ట్రంప్ అద్యక్షుడుగా ఎన్నికైన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు ప్రధానంగా ఐటీ పరిశ్రమపై తీవ్రంగా కన్పిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే దేశీయ ఐటీ కంపెనీలు అనేక తమ ఖర్చులను తగ్గించుకొనే పనిని చేపడుతున్నాయి.

రానున్న మూడేళ్ళలో నాలుగోవంతు మందికి ఆయా కంపెనీలు ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలుత సీనియర్లపైనే వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.

సర్వీసులపై ఆధారపడ్డ కంపెనీల్లోనే కోతలెక్కువగా ఉండే అవకాశాలున్నాయి.సీనియర్లకు ఇంకా వేతనాలు పెంచలేదు కొన్ని కంపెనీలు.

11 లక్షలమంది ఐటీ ఉద్యోగులపై ప్రభావం

11 లక్షలమంది ఐటీ ఉద్యోగులపై ప్రభావం

దేశంలో ప్రస్తుతం 45 లక్షలమంది ఐటీ ఉద్యోగుల్లో 11 లక్షల మంది ఉద్యోగుల వేటుకు గురయ్యే విషయంలో ప్రభావితం కానున్నారు.పనితీరు ఆధారంగానే ఉద్యోగులపై వేటు వేస్తున్నామని ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయినవారిలో 30 నుండి 50 ఏళ్లలోపువారే కావడం గమనార్హం.కొత్తవారిని తీసుకోవడంతో పాటు వారికి శిక్షణనిచ్చి పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

వేతనాలు పెంచలేదంటే ఇంటికేనా?

వేతనాలు పెంచలేదంటే ఇంటికేనా?

ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్లకు వేతనాలు పెంచకుండా కొన్ని కంపెనీలు నిర్ణయాన్ని తీసుకొన్నాయి. టీసీఎస్ లో ఏడేళ్ళ అనుభవం ఉన్నవారికి మాత్రమే వేతనాలను పెంచారు. ఆపై అనుభవం ఉన్నవారికి వేతనాలు పెంచలేదు.గతంతో పోలిస్తే ఇక ప్రతి ఏటా వేతనాల పెంపు భారీగా ఉండే అవకాశాలు లేకపోవచ్చని ఐటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగంలో చేరినప్పుడే స్వచ్చంధంగానే తాము రాజీనామా చేస్తున్నట్టుగా కొన్ని కంపెనీలు ఉద్యోగులతో సంతకాలు తీసుకొంటాయని, అవసరమైన సందర్భాల్లో వాటిని ఉపయోగించుకొంటాయని ఐటీ కంపెనీల ఉద్యోగులు చెబుతున్నారు.

ఐటీయేతర రంగాన్ని ప్రోత్సహించాలి

ఐటీయేతర రంగాన్ని ప్రోత్సహించాలి

ప్రతిభ ఉంటేనే ఉద్యోగులను ఆయా కంపెనీలు కొనసాగిస్తాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు చైనా తరహాలోనూ ఐటీయేతర రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని నిపుణులు కోరుతున్నారు.ఇతర రంగాల్లో కూడ భారీ పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. ట్రంప్ ప్రబావం భారత ఐటీ రంగంపై అతి స్వల్పమే.2017-18 కాలానికి క్యాంపస్ నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి.2018-19 సెప్టెంబర్ నుండి రిక్రూట్ మెంట్ ను మొదలుపెట్టనున్నట్టు కొన్ని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది 4% ఉద్యోగులపై వేటు?

ఈ ఏడాది 4% ఉద్యోగులపై వేటు?


కంపెనీలు ప్రతి ఏటా 1-1.5 శాతం ఉద్యోగులను తొలగించడం సహాజం. అయితే ఈ సారి 2 నుండి 4 శాతానికి పెరిగే అవకాశం ఉండొచ్చని అంచనాలున్నాయి. ఇప్పటికే టెక్ మహీంద్రా సుమారు వెయ్యిమందికి ఉద్వాసన పలికింది. విప్రోలో 500మందిని తొలగించింది. పనితీరు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. కాగ్నిజెంట్ సుమారు 10 వేల మందిని తొలగించాలని నిర్ణయం తీసుకొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
About 20 crore middle class young people would have no jobs or less jobs by 2025 due to increasing automation and improvement in technology, industry veteran T V Mohandas Pai said.
Please Wait while comments are loading...