Jharkhand Exit Poll: జార్ఖండ్ లో వారిదే అధికారమంటున్న ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్..!
జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ మ్యాట్రిజ్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు సాగినా అంతిమంగా ఎన్డీయేకే గెలుపు అవకాశాలున్నట్లు మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.
జార్ఖండ్ అసెంబ్లీలోని 81 సీట్లలో అధికారం కోసం ఏ పార్టీకైన 41 సీట్లు రావాలి. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఎన్డీయే కూటమికి 42 నుంచి 47 సీట్లు లభించబోతున్నట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ తేల్చింది. అటు అధికార ఇండియా కూటమికి 25 నుంచి 30 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు మరో 1 నుంచి 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కీలకంగా మారబోతోంది.

గిరిజన రాష్ట్రమైన జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అధికార మార్పుకు ఓటేశారని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఏబీపీ మ్యాట్రిజ్ తో పాటు పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఇక్కడ విపక్ష బీజేపీ అధికారం చేపట్టబోతోందని అంచనా వేశాయి. దీంతో హేమంత్ సోరెన్ సర్కార్ అవినీతి మరకలు ఇండియా కూటమిని ముంచేసినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ నెల 23న జరిగే కౌంటింగ్ లోనూ ప్రతిబింబిస్తాయో లేదో చూడాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications