నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్‌ దాడి చేసిన ఆగంతకుడు .. యూపీలో మరో దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని గోండా నగరంలో దారుణం చోటుచేసుకుంది. యూపీలో హత్రాస్ దారుణ సంఘటన దేశవ్యాప్త ఆందోళనకు కారణం కాగా, ఆ తర్వాత కూడా వరుస ఉదంతాలు యూపీ ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించాయి . మహిళలు బాలికలపై అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యంగా మారుతున్నాయి.

నిద్రిస్తున్న బాలికలపై యాసిడ్ బాటిల్ విసిరి పారిపోయిన ఆగంతకుడు

నిద్రిస్తున్న బాలికలపై యాసిడ్ బాటిల్ విసిరి పారిపోయిన ఆగంతకుడు

తాజాగా సోమవారం రాత్రి ముగ్గురు మైనర్ బాలికలైన అక్కాచెల్లెళ్లు నిద్ర పోతున్న సమయంలో వారిపై యాసిడ్‌తో దాడి చేశారు గుర్తు తెలియని ఆగంతకుడు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు షెడ్యూల్డు కులానికి చెందినవారు.

8, 12, మరియు 17 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు బాలికలు నిద్రిస్తున్న సమయంలో వారిపై కిటికీలోనుండి యాసిడ్ బాటిల్ విసిరి ఆగంతకుడు పరారయ్యాడు. ముగ్గురు బాలికలలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, పెద్ద అమ్మాయి ముఖానికి , ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.

బాలికలకు గాయాలు .. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స

బాలికలకు గాయాలు .. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స

ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందర్నీ విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఇంతవరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదు.

ముగ్గురు బాలికలపై దాడి చేయడానికి ఉపయోగించిన రసాయనాన్ని పరిశీలిస్తున్నామని, బాధితులు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గోండా ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయని , పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.

ఇంటి రెండో అంతస్తు గది కిటికీ నుండి యాసిడ్ అటాక్ .. తెలిసిన వారి పనే అని అనుమానం

ఇంటి రెండో అంతస్తు గది కిటికీ నుండి యాసిడ్ అటాక్ .. తెలిసిన వారి పనే అని అనుమానం


సోమవారం రాత్రి 2.30 గంటల సమయంలో గోండాలోని పారాస్పూర్ పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న పాస్కా గ్రామంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు . ప్రాధమిక దర్యాప్తులో బాలికలు ఇంటి రెండవ అంతస్తులోని గదిలో నిద్రిస్తున్నారని , కిటికీ డోర్ తీసి ఉండటంతో కిటికీ నుండి యాసిడ్ విసిరి పారిపోయారని చెప్పారు . దాడి చేసిన వ్యక్తికి కుటుంబం గురించి తెలుసునని, అమ్మాయిలు రెండవ అంతస్తులోని ఒక గదిలో నిద్రిస్తారని కూడా తెలిసే దాడికి పాల్పడ్డారని అన్నారు. దాడి చేసిన వ్యక్తిని, నేరానికి కారణాన్ని పోలీసు బృందం ఇంకా గుర్తించలేదని దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు .

 హత్రాస్ ఘటన మరువకముందే .. యూపీలో మరో దారుణం

హత్రాస్ ఘటన మరువకముందే .. యూపీలో మరో దారుణం

ముగ్గురు బాలికలలో పెద్ద అమ్మాయి ఇచ్చే సమాచారం నిందితులను కనిపెట్టడానికి మరియు దాడి వెనుక కారణాన్ని తెలుసుకోటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. హత్రాస్ దారుణ సంఘటన మర్చిపోకముందే యూపీలో వరుస దాడులు జరుగుతున్నతీరు ఆందోళన కలిగిస్తుంది . తాజాగా ముగ్గురు బాలికలపై యాసిడ్ దాడి కూడా యూపీలో కలకలం సృష్టించింది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+