డ్రగ్స్‌కేసు కలకలం: నార్కొటిక్స్ విచారణకు బాలీవుడ్ స్టార్ హీరో: ఇప్పటికే గర్ల్‌ఫ్రెండ్ అరెస్ట్
ముంబై: కొద్దిరోజులుగా బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసుల్లో మరో కొత్త ముఖం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రామ్‌పాల్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తోన్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు ఆయనకు కొద్దిసేపటి కిందటే సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఈ ఉదయం ఆయన నార్కొటిక్స్ కార్యాలయానికి చేరారు. విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అర్జున్ రామ్‌పాల్ సన్నిహితుడు పాల్ బార్టెల్, గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా దెమెత్రియాడెస్ అరెస్ట్ అయ్యారు.
ఈ పరిస్థితుల్లో అర్జున్ రామ్‌పాల్‌కు అరెస్టు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు బాలీవుడ్‌లో వ్యక్తమౌతున్నాయి. ఈ నెల 9వ తేదీన గాబ్రియెలా ఇంటిపై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఆమెతో పాటు పాల్ బార్టెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మూడురోజులుగా దశలవారీగా వారిని విచారించారు. ఈ విచారణ సందర్భంగా అర్జున్ రామ్‌పాల్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆయనకు అదేరోజు సమన్లను జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక సమాచారం మేరకు అర్జున్ రామ్‌పాల్ నివాసంపైనా దాడి చేశారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి.

సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు. ఇదే కేసులో అంతకుముందు రోజు రాత్రే బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్‌వాలా భార్యను అరెస్టు అయ్యారు. ఆమె కూడా అర్జున్ రామ్‌పాల్ పేరును వెల్లడించినట్లు సమాచారం. ఫిరోజ్ నడియాడ్‌వాలా నివాసంపై దాడి చేసిన సమయంలో ఎన్సీబీ అధికారులు 10 గ్రాముల మరిజువానాను స్వాధీనం చేసుకున్నట్లు తెలస్తోంది. దీనితో ఆమెను అరెస్టు చేశారు. దీన్ని ఏ డ్రగ్ పెడ్లర్ వద్ద నుంచి కొనుగోలు చేశారనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ కేసులో దీపికా పడుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను విచారించారు.












Click it and Unblock the Notifications