వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసులో చేరిన సీనియర్ నటుడు కార్తిక్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సీనియర్ నటుడు కార్తిక్ బుధవారంనాడు కాంగ్రెసు పార్టీలో చేరారు. తన పార్టీ అఖిల ఇండియా నాదలం మక్కల్ కచ్చిని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. 54 ఏల్ల కార్తిక్ 2006లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొదట ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు.

ఫార్వర్డ్ బ్లాక్‌లో తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. 2009లో లోకసభ ఎన్నికలకు ముందు సొంతంగా పార్టీని స్థాపించారు. 2011 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడియంకెతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

తమిళనాడులో కార్తిక్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తమిళ, తెలుగు భాషల్లో ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణను పొందాయి. సీతాకోక చిలుక, అభినందన, అన్వేషణ, గోపాలరావు గారి అబ్బాయి వంటి తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు. సీతాకోక చిలుక తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. ఘర్షణ వంటి తమిళ చిత్రాలు కూడా తెలుగులోకి వచ్చాయి.

కాంగ్రెసులోకి కార్తిక్

కాంగ్రెసులోకి కార్తిక్

ప్రముఖ సిసనీ నటుడు కార్తిక్ బుధవారం సాయంత్రం తమిళనాడు కాంగ్రెసు కార్యాలయానికి వచ్చి ఆ పార్టీలో చేరారు.

కాంగ్రెసులోకి కార్తిక్

కాంగ్రెసులోకి కార్తిక్

ప్రముఖ సినీ నటుడు కార్తిక్ తమిళనాడు కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వచ్చి కాంగ్రెసు కండువాను కప్పుకున్నారు.

కాంగ్రెసులోకి కార్తిక్

కాంగ్రెసులోకి కార్తిక్

ప్రముఖ సినీ నటుడు కార్తిక్ తమిళనాడు కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వచ్చి ఆ పార్టీలో చేరారు. ఆయనకు ఇలా అభివనందనలు..

కాంగ్రెసులోకి కార్తిక్

కాంగ్రెసులోకి కార్తిక్

కాంగ్రెసులోకి ప్రముఖ సినీ నటుడు కార్తిక్ కాలు పెట్టారు. ఆయన తన సొంత పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు.

English summary
The actor and politician Karthik joined Tamilnadu congress committee today and merged his party with congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X