మెర్సల్ సినిమా వివాదం: బీజేపీ నాయకులకు షాక్: జోసెఫ్ విజయ్ పేరుతో హీరో ప్రకటన, హ్యాపీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ మెర్సల్ సినిమా విషయంలో హీరో విజయ్ మీద మండిపడుతున్న బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. మోడీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీఎస్ టీ, డిజటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ సినిమాలో డైలాగులు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు.

వెంటనే ఆ డైలాగులు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు హీరో విజయ్ హిందువులు, హిందూ దేవుళ్లను కించపరిచి మనకు కావాల్సింది దేవాలయాలు కాదు, ఆసుపత్రులు అంటూ మా మనోభావాలు దెబ్బ తీశారని ఆరోపిస్తూ మదురైలో కేసు పెట్టారు.

Actor Vijay fans very happy over for his statement in the name of Goseph Vijay

హీరో విజయ్ క్రిస్టియన్ కావడం వలనే ఇలా హిందువులను అవమానించారని ఆరోపించారు. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ అని ప్రచారం చేశారు. మెర్సల్ సినిమా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బుధవారం హీరో విజయ్ బీజేపీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.

మెర్సల్ వివాదం విషయంలో తనకు మద్దతుగా నిలబడి సినిమా సూపర్ హిట్ కావడానికి కారణం అయిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ హీరో విజయ్ 'జోసెఫ్ విజయ్'పేరుతో బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన పేరు జోసెఫ్ విజయ్ అంటూ అధికారికంగా ప్రకటించి బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. హీరో విజయ్ 'జోసెఫ్ విజయ్'పేరుతో ప్రకటన విడుదల చెయ్యడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Vijay has thanked all for the support in Mersal issue and grand success of the movie. Actor Vijay fans very happy over for his statement in the name of "Goseph Vijay".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి