• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: బిగ్ బాస్ ఫేమ్ సీక్రెట్ పెళ్లి, నాగార్జునతో కాపురం చేస్తా, ఏం చేస్తారు ?, పోలీసు కేసుతో షాక్ !

|

బెంగళూరు/కేజీఎఫ్/మండ్య: కన్నడ బిగ్ బాస్ ఫేమ్, నటి పెళ్లి వివాదాస్పదమైయ్యింది. కన్నడ బిగ్ బాస్ లో మంచి పేరు తెచ్చుకున్న ఆ నటి రహస్యంగా నాగార్జునను పెళ్లి చేసుకోవడంతో పంచాయితీ పోలీసుల దగ్గరకు వెళ్లింది. నేను బజారుదాన్ని అంటూ నాగార్జున కుటుంబ సభ్యులు దూషించారని బిగ్ బాస్ ఫేమ్ ఆరోపించింది. నాగార్జునను నిర్బంధించి బలవంతం చేసి గుడిలో తాను తాళి కట్టించుకున్నానని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, నాగార్జున ఏమైనా చిన్నపిల్లాడా ?, ఆయతోనే నేను కాపురం చేస్తాను, ఏం చేస్తారు అంటూ బిగ్ బాస్ ఫేమ్ మండిపడుతోంది. తనకు నాగార్జున కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని బిగ్ బాస్ ఫేమ్ అర్దరాత్రి పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

Illegal affair: పెళ్లికి ముందే మస్త్ మజా, జల్సా, ప్రియురాలిని, కొడుకుని 30 ముక్కలు చేసి!

 నటి, కన్నడ బిగ్ బాస్ ఫేమ్

నటి, కన్నడ బిగ్ బాస్ ఫేమ్

ప్రముఖ కన్నడ నటి, కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొని పాపులర్ అయిన చైత్రా కూటూర్ పెళ్లి విషయం రాద్దాంతం అయ్యింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్రా తరువాత కన్నడ బిగ్ బాస్ షోతో ప్రజలకు, అభిమానులకు మరింత దగ్గర అయ్యింది. చైత్రా లవ్ మ్యారేజ్ జరిగిన రోజే ఆమె మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

 నాగార్జునతో రహస్యంగా పెళ్లి

నాగార్జునతో రహస్యంగా పెళ్లి

కర్ణాటకలోని మండ్య నివాసి నాగార్జున, కన్నడ బిగ్ బాస్ షో ఫేమ్ చైత్రా ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించారని తెలిసింది. మూర్చి 28వ తేదీ ఆదివారం (నిన్న) బెంగళూరులోని ఓ దేవాలయంలో నటి చైత్రా, నాగార్జున వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన రోజే చైత్రా తనకు న్యాయం చెయ్యాలని, భద్రత కల్పించాలని అర్దరాత్రి పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

నేను బజారుదాన్నా ?

నేను బజారుదాన్నా ?

పెళ్లి విషయం రాద్దాంతం కావడంతో నటి చైత్రా మీడియా ముందు వివరణ ఇచ్చారు. నాగార్జున తనను వివాహం చేసుకోవడం మొదటి నుంచి ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని నటి చైత్రా ఆరోపించారు. నేను సినిమాల్లో నటిస్తున్నానని, తనకు క్యారెక్టర్ లేదని, తాను బజారు దాన్ని అంటూ నాగార్జున కుటుంబ సభ్యులు తనను దూషించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 నాగార్జున చిన్నపిల్లాడా ? సంకలో పెట్టుకుని వెళ్లానా

నాగార్జున చిన్నపిల్లాడా ? సంకలో పెట్టుకుని వెళ్లానా

నాగార్జునను బలవంతంగా లాక్కెళ్లి గుడిలో చైత్రా పెళ్లి చేసుకునిందని నాగార్జున కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాను నాగార్జునను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ఆయన ఏమైనా పిల్లాడా ? మీరే చెప్పండి, ఏది తప్పు, ఏది రైట్ అనే విషయం ఆయనకు తెలీదా ? అని చైత్రా ప్రశ్నించింది. నాగార్జునను నేను ఏమైనా సంకలో పెట్టుకుని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నానా ? అని చైత్రా పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులను ప్రశ్నించింది.

 నన్ను చంపేస్తారంట

నన్ను చంపేస్తారంట

నటి చైత్రా, నాగార్జున రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం వెంటనే బయటకు తెలిసిపోయింది. పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే నాగార్జున కుటుంబ సభ్యులు మండ్య నుంచి పరుగో పరుగు అంటూ బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు వచ్చిన నాగార్జున కుటుంబ సభ్యులు నిన్ను చంపేసి మావాడిని పిలుచుకుని వెళ్లిపోతామని నన్ను బెదిరించారని, వాళ్లతో తనకు ప్రాణహాని ఉందని నటి చైత్రా ఆరోపిస్తోంది.

 కోలారు, కేజీఎఫ్ వెళ్లనివ్వకుండ దాడి ?

కోలారు, కేజీఎఫ్ వెళ్లనివ్వకుండ దాడి ?

బెంగళూరులో పెళ్లి చేసుకున్న తరువాత నాగార్జున, నేను కోలారు వెళ్లడానికి బయలుదేరామని, ఆ సమయంలో నాగార్జున కుటుంబ సభ్యులు మమ్మల్ని అడ్డగించి గొడవ చేశారని నటి చైత్రా ఆరోపించింది. తనకు తోడుగా ఉన్న మా అమ్మానాన్న మీద నాగార్జున కుటుంబ సభ్యులు చెయ్యి చేసుకోవడమే కాకుండా మా అన్న మీద దాడి చేశారని ఆరోపిస్తూ చైత్రా పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

 నాగార్జునతో కాపురం చేస్తా..... ఏం చేస్తారో చేసుకోండి

నాగార్జునతో కాపురం చేస్తా..... ఏం చేస్తారో చేసుకోండి

నువ్వు మా తమ్ముడితో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తా, మండ్యలో నువ్వు అడుగుపెట్టలేవు, నీ అంతు చూస్తా, నిన్ను పైకి పంపిస్తా అంటూ నాగార్జున అక్క తనతో చాలెంజ్ చేసిందని నటి చైత్రా ఆరోపించింది. నాను కచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగార్జునతోనే కాపురం చేస్తాను, నన్ను ఎవ్వరూ లేమీ చెయ్యలేరని నటి చైత్రా మండిపడింది.

వీడో తిక్కలోడు.... బ్రైన్ వాష్ చేశారు

వీడో తిక్కలోడు.... బ్రైన్ వాష్ చేశారు

తనను నాగార్జున ఎంతో ఇష్టపడి ప్రేమించాడని నటి చైత్రా చెప్పింది. ఒకసారి నువ్వు నా ప్రాణం అని చెబుతాడని, మరోసారి మా ఇంట్లో వాళ్లు చెప్పినట్లు విందాం అని అంటాడని, నాగార్జున ఒకమాట మీద నిలబడటం లేదని, వీడో తిక్కలోడు అనే టైపులో నటి చైత్రా చెప్పడం గంధరగోళంగా మారింది. అయితే నాగార్జునకు ఆయన కుటుంబ సభ్యులు బ్రైన్ వాష్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, మీరే నాకు న్యాయం చెయ్యాలని పెళ్లి జరిగిన రోజు రాత్రే నటి చైత్రా బెంగళూరు పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

English summary
Actress Chaitra Kotoor reaction after her marriage controversy. Chaitra Kotoor tie the knot with Nagarjuna on March 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X