Actress: కెమెరామెన్ ఇంట్లో రాత్రి నటి లిక్కర్ పార్టీ, సీన్ కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ ఎంట్రీతో ? !
చెన్నై/టీ నగర్: సిపిమాల్లో నటించాలని యువతికి ఆశ పుట్టింది. అనుకున్నట్లు సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలు వచ్చాయి. ప్రముఖ హీరో సినిమాలో ఆమె సహాయనటిగా నటిస్తున్న సమయంలో సినీరంగానికి చెందిన ప్రముఖులు కొందరు ఆమెకు పరిచయం అయ్యారు. ఆ సినిమాకు ఫేమస్ కెమెరామెన్ పని చేశాడు. ఆసినిమాలో నటిస్తున్న యువతికి హీరోయిన్ గా అవకాశాలు ఇప్నిస్తానని ఆ కెమెరామెన్ నమ్మించాడు. రాత్రి తన ఇంటికి వస్తే కొత్త సినిమాలు, టీవీ సీరియల్స్ గురించి చర్చిద్దామని కెమెరామెన్ ఆమెకు చెప్పాడు. రాత్రి కెమెరామెన్ ఇంట్లో అతనితో పాటు ఆ నటి మద్యం సేవించారని తెలిసింది. తరువాత కెమెరామెన్ ఆ సహాయనటిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. కొంతసేపటి తరువాత ఆ సహాయనటి బాయ్ ఫ్రెండ్ కెమెరామెన్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

హీరోయిన్ కావాలని ఆశ
చెన్నై సిటీలోని కొలత్తూరులో 22 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. చూడటానికి ఆ యువతి అందంగా సన్నగా, పొడవుగా ఉంటుంది. మొదటి నుంచి సిపిమాల్లో నటించాలని యువతికి ఆశ పుట్టింది. అనుకున్నట్లు సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలు వచ్చాయి. ప్రముఖ హీరో సినిమాలో ఆమె సహాయనటిగా నటిస్తున్న సమయంలో సినీరంగానికి చెందిన ప్రముఖులు కొందరు ఆమెకు పరిచయం అయ్యారు.

కెమెరామెన్ కాశీనాథన్ ఎంట్రీ
ప్రముఖ హీరో నటించిన ఆ సినిమాకు ఫేమస్ కెమెరామెన్ కాశీనాథన్ (42)కెమెరామెన్ గా పని చేశాడు. ఆసినిమాలో నటిస్తున్న యువతికి హీరోయిన్ గా అవకాశాలు ఇప్నిస్తానని కెమెరామెన్ కాశీనాథన్ నమ్మించాడు. అప్పటి నుంచి కాశీనాథన్, ఆసహాయనటి టచ్ లో ఉన్నారు. నిత్యం ఫోన్లు చేసుకుంటూ సినిమాల టాపిక్ మాట్లాడుకుంటున్నారు.

రాత్రి ఇంట్లో లిక్కర్ పార్టీ
చెన్నై సిటీలోని వలసరవాక్కాంలోని ఓంశక్తి నగర్ మెయిన్ రోడ్డులో కెమెరామెన్ కాశీనాథన్ నివాసం ఉంటున్నాడు. రాత్రి తన ఇంటికి వస్తే కొత్త సినిమాలు, టీవీ సీరియల్స్ గురించి చర్చిద్దామని కెమెరామెన్ కాశీనాథన్ సహాయనటికి చెప్పాడు. రాత్రి కెమెరామెన్ కాశీనాథన్ ఇంటికి ఆమె వెళ్లింది. గంట సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తరువాత కెమెరామెన్ కాశీనాథన్ ఇంట్లో అతనితో పాటు ఆ సహాయనటి మద్యం సేవించారని సమాచారం.

బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసిన నటి
మద్యం మత్తులో ఉన్న సహాయనటి మీద కెమెరామెన్ కెమెరామెన్ కాశీనాథన్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. కొంతసేపు ఓపికగా ఉన్న సహాయనటి తరువాత ఆమె బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి కాశీనాథన్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఫోన్ చేసి చెప్పింది. కొంత సేటి తరువాత ఆ సహాయనటి బాయ్ ఫ్రెండ్ కెమెరామెన్ కాశీనాథన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఆమెను అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లిపోయాడు.

సెంట్రల్ జైల్లో కెమెరామెన్
సహాయనటి లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో పోలీసులు కెమెరామెన్ కాశీనాథన్ ను అరెస్టు చేసి చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సహాయనటిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ప్రముఖ కెమెరామెన్ కాశీనాథన్ ను చెన్నై పోలీసులు అరెస్టు చెయ్యడంతో తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications