వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడికి వెళ్లడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు, పళ్లు తింటున్న సత్యేంద్ర జైన్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రస్తుతం తీహర్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని కాళ్లకు మసాజ్ చేయించుకునే వీడియో ఒకటి తిరుగుతుంది. దీంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆప్ దిద్దుబాటు చర్యలకు దిగింది. అసలు ఏం జరిగిందో తెలియజేసింది.సత్యేంద్ర జైన్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపింది.

దీంతో కోర్టు కూడా అన్నీ రకాల వైద్యం అందజేయాలని కోరిందని గుర్తుచేసింది. అందులో భాగంగానే జైలులో అక్యుప్రెషర్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని వివరించింది. ఇదీ వైద్యంలో భాగం అని పేర్కొంది. తమ మాజీ మంత్రిని ఇలా రక్షించుకునే ప్రయత్నం చేసింది.

Acupressure part of treatment: AAP

జైలులో జైన్ వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను విధుల నుంచి తప్పించారు. ఇంతలో మరో వీడియో బయటకు వచ్చింది.

ఆ వీడియో పాతదని జైలు అధికారులు తెలియజేశారు. ఇప్పటికే సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని కూడా తెలిపారు. పడుకోవడంలో జైన్ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పలు సందర్భాల్లో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిందని వివరించారు. దీంతో కోర్టు వైద్యం చేయించాలని కోరిందని తెలిపారు. నరాల సంబంధిత వ్యాధితో జైన్ బాధపడుతున్నారు. దీంతో అక్యుప్రెషర్ చికిత్స అందిస్తున్నారు.

ఆరోగ్యం దెబ్బతినడంతో గత 4 నెలల నుంచి ఆహారం సరికి తీసుకోవడం లేదని పార్టీ తెలిపింది. ఆలయం వెళ్లకుంటే ఆహారం తీసుకోరని.. అందుకే పళ్లను తీసుకుంటున్నారని తెలిపింది. కోర్టు ఆదేశాలతో అక్యుప్రెషర్ మసాజ్ కూడా వైద్యంలో భాగం అని తెలిపింది.

English summary
Aam Aadmi Party has said acupressure was a part of his treatment. first reaction to Delhi Minister Satyendar Jain’s massage video from jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X