Jeet Adani: కొత్తగా పెళ్లయిన ఆ మహిళలకు జీత్ అదానీ ఆర్థిక సాయం..ఎంతో తెలుసా..!!

అపర కుబేరుడు, ఇండస్ట్రియలిస్ట్ గౌతం అదానీ చిన్న కొడుకు వివాహం సందర్భంగా ఆ కుటుంబం మంచి దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగల్ సేవా పేరుతో కొత్తగా పెళ్లయిన దివ్యాంగ మహిళలకు చేయూతనిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఇక నుంచి ఏటా కొత్తగా పెళ్లయిన 500 మంది దివ్యాంగ మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు గౌతం అదానీ.

తన వివాహ మహోత్సవానికి ఇంకా రెండ్రోజుల సమయం ఉందనగా అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ కొత్తగా పెళ్లయిన 21 మంది దివ్యాంగులైన మహిళలను కలిసి ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఫిబ్రవరి 7వ తేదీన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దివా షాను జీత్ అదానీ మనువాడనున్నారు. కొత్తగా పెళ్లయిన దివ్యాంగ మహిళలకు ఆర్థిక సహాయం చేయాలన్న తన చిన్న కుమారుడు జీత్ అదానీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు అదానీ.వధూవరుల తొలి ప్రయాణం ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందని అదానీ అన్నారు.

Adani Family Supports Newly Married Divyang Women

జీత్ అదానీ-దివా షాలు తీసుకున్న ఈ మంచి నిర్ణయం దివ్యాంగులైన మహిళలు, వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందన్నారు.ఈ సేవను ఇలానే కొనసాగిస్తూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిస్తూ కాబోయే భార్యాభర్తలను ఆశీర్వదించారు అదానీ.

భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్‌‌కు డైరెక్టర్‌గా జీత్ అదానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కంపెనీ కింద 8 విమానాశ్రయాల నిర్వహణ అభివృద్ధి జరుగుతోంది. ఎయిర్‌పోర్ట్ బిజినెస్ మాత్రమే కాకుండా, అదానీ గ్రూప్ డిఫెన్స్, పెట్రోకెమికల్స్, కాపర్ బిజినెస్‌లను కూడా జీత్ అదానీ హ్యాండిల్ చేస్తున్నారు.అదానీ డిజిటల్ గ్రూప్‌కు కూడా జీత్ అదానీ నేతృత్వం వహిస్తున్నారు.

గుజరాత్‌లోని ముంద్రా ప్రాంతంలో ఓ గ్రామీణ ప్రాజెక్టు చేపట్టి ఆ తర్వాత అదానీ గ్రూప్ అనే పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించిన తల్లి డాక్టర్ ప్రీతి అదానీ నుంచి ప్రేరణ పొందారు జీత్ అదానీ. నేడు అదానీ సంస్థ ప్రపంచ దేశాల్లో తన వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తోంది.వ్యాపార రంగంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. దాతృత్వంలో తల్లిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు జీత్ అదానీ. ముఖ్యంగా దివ్యాంగులకు ఆర్థిక సాయం చేయడంలో ఎప్పుడూ ముందున్నారు జీత్ అదానీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+