Adani News: ముట్టుకున్నదల్లా మట్టే.. బంగ్లాదేశ్ అదానీ విద్యుత్ వ్యాపారంలో కల్లోలం..

Adani Power: గత ఏడాది నుంచి భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దేశంగానే కాకుండా ఆయన తలపెట్టిన అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులు సైతం వరుస షాక్స్ ఇస్తున్నాయి. పవర్ నుంచి ఎయిర్ పోర్టుల వరకు అనేక వ్యాపారాల విషయంలో ప్రస్తుతం అదానీ గ్రూప్ లాభాల కంటే నడపటమే కష్టతరమైన పరిస్థితులను చూస్తున్నాయి.

తాజాగా అదానీ పవర్ కంపెనీకి సైతం ఎదురుదెబ్బలు తప్పటం లేదు. నివేదికల ప్రకారం అదానీ పవర్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన అదానీ పవర్ జార్ఖండ్ లిమిటెడ్ కష్టాల్లో చిక్కుకుంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత, ప్రధాని మార్పు వంటి పరిస్థితులు అదానీ వ్యాపారానికి పెద్ద ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో అదానీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ కు విద్యుత్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మార్పు తర్వాత బిల్లుల బకాయిలు ఏకంగా 846 మిలియన్ డాలర్లకు చేరుకోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అదానీ గ్రూప్ విద్యుత్ సరఫరాను బంగ్లాదేశ్‌కు సగానికి తగ్గించినట్లు వెల్లడైంది.

Adani group cut power supply to Bangladesh drastically amid pending bills mounting

పవర్ గ్రిడ్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన డేటా అదానీ ప్లాంట్ అక్టోబర్ 31 రాత్రి సరఫరాను తగ్గించిందని వెల్లడైంది. అదానీకి చెందిన థర్మల్ పవర్ ప్లాంట్ 1,496-మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో యూనిట్ నుంచి దాదాపు 700MW ఉత్పత్తి చేస్తోందని తెలుస్తోంది. ఇది జాతీయ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ గత రాత్రి 1,600 మెగావాట్ల కంటే ఎక్కువ కొరతను నివేదించిందని వార్తా పత్రికల్లో నివేదించబడింది. దీనికి కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ చెల్లించాల్సిన బకాయిలను అక్టోబర్ 30లోగా క్లియర్ చేసేలా ఆదేశించాలని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్ పవర్ సెక్రటరీని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. బిల్లులు చెల్లించకుంటే అక్టోబర్ 31న విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ద్వారా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం పరిష్కార చర్యలు చేపట్టాలని కంపెనీ అక్టోబర్ 27న రాసిన లేఖలో పేర్కొంది.

బంగ్లాదేశ్ కృషి బ్యాంక్ నుండి $170.03 మిలియన్ల మొత్తానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ని అందించలేదని లేదా $846 మిలియన్ల బకాయి మొత్తాన్ని క్లియర్ చేయలేదని అదానీ పవర్ వెల్లడించింది. ఈ క్రమంలోనే మా రుణదాతలు వర్కింగ్ క్యాపిటల్ సపోర్టును ఉపసంహరించుకోవడం వల్ల బొగ్గు సరఫరాదారులు, కార్యకలాపాలు, నిర్వహణ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడంలో అదానీ పవర్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణలో విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చివరిగా రాసిన లేఖలో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. మునుపటి బకాయిల్లో కొంత భాగాన్ని తాము ఇంతకు ముందు క్లియర్ చేశామని, అయితే జూలై నుండి, అదానీ ఎక్కువ వసూలు చేస్తోందని బంగ్లాదేశ్ పవర్ కు చెందిన అధికారి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

వారం వారీ చెల్లింపులు పెరగటంతో పాటు డాలర్ల కొరత కారణంగా చెల్లింపు ఆలస్యమైనట్లు బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో చెల్లింపుకు వ్యతిరేకంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ లేఖను తెరవడంలో బ్యాంక్ విఫలమైందని వెల్లడైంది. ఒక సంవత్సరం అనుబంధ ఒప్పందం పదవీకాలం ముగిసిన తర్వాత.. అదానీ పవర్ మళ్లీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం వసూలు చేయడం ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+