అదానీ ఇంట్లో పెళ్లి సందడి.. ఇక్కడే అసలు ట్విస్ట్..
ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. అదానీ చిన్నకుమారుడు జీత్ అదానీ పెళ్లి ఇవాళ(ఫిబ్రవరి 7)న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న అదానీ కుటుంబం.. ఈ వివాహం మాత్రం సంప్రదాయబద్ధంగా, ఎలాంటి హంగూఆర్భాటాలకు పోకుండా, ఆడంబరాలు లేకుండా సాధారణ మధ్య తరగతి పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో అలానే జీత్ అదానీ, దివా జైమిన్ షా పెళ్లి జరిగింది.ప్రత్యేక ఆహ్వానితులు,ప్రపంచ కుబేరులు, సెలబ్రిటీస్ ఎవరూ ఈ వివాహ వేడుకకు హాజరు కాలేదు. కేవలం అదానీ కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. ఫిబ్రవరి 5న పెళ్లి ఏర్పాట్లను ప్రారంభించారు.
జీత్ అదానీ, దివా షాల వివాహం ప్రత్యేక పూజలతో ప్రారంభం అయింది. జీత్ వివాహాన్ని సాధారణంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. సెలబ్రిటీలు ఎవరూ ఈ వేడుకలో పాల్గొనరని చెప్పారు. గతేడాది గంగాహారతిలో అదానీ కుటుంబం పాల్గొంది. ఆ సమయంలోనే గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో ఎలాగైతే పెళ్లి జరుగుతుందో అదే విధంగా జీత్, దివాల వివాహం ఉంటుందన్నారు. సంప్రదాయబద్ధంగా, కుటుంబసభ్యుల మధ్యే పెళ్లి వేడుక ఉంటుందని నాడు తెలిపారు.

వ్యవస్థలో మార్పుకోసం పెళ్లి..
జీత్, దివా వారి వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అనుకున్నారు. సంప్రదాయం, కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చేలా వారి వివాహం జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా.. ప్రముఖ దివ్యాంగుల ఎన్జీఓతో చేతులు కలిపి జీత్, దివాల వివాహానికి షావల్స్ తయారు చేశారు. అంతేకాక ఈ ఎన్జీఓ నే వివాహ విందులో వాడే ప్లేట్లు, గ్లాసులకు పెయింట్స్ కూడా వేసింది. ఈ ఐడియా జీత్ అదానీదే.. ఆయనెప్పుడూ దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తూఉంటారు. పెళ్లి చేసుకున్న ఒక్కో దివ్యాంగ మహిళకు రూ. 10 లక్షల చొప్పున 500 మంది మహిళలకు సాయం చేయాలని ఈ జంట సంకల్పించింది.
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
— Gautam Adani (@gautam_adani) February 7, 2025
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
"భగవంతుడి చల్లటి ఆశీస్సులతో జీత్ దివాలు ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం ఈ రోజు అహ్మదాబాదులో సంప్రదాయ పద్దతిలో జరిగింది.కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్యనే ఈ వేడుక జరిగింది.అందరినీ ఆహ్వానించాలని ఉన్నప్పటికీ ఇది కుటుంబ వేడుక కావడంతో ఆహ్వానించలేక పోయినందుకు మన్నించాలి. ప్రతి ఒక్కరూ పెద్ద మనసు చేసుకుని కొత్త జంట జీత్-దివాలను నిండుగా ఆశీర్వదించండి" అంటూ గౌతం అదానీ ట్వీట్ చేశారు.
ఇక అదానీ చిన్నకుమారుడైన జీత్ అదానీ ప్రస్తుతం అదానీ ఎయిర్ పోర్ట్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2019లో అదానీ గ్రూప్స్ లో ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. జీత్.. అమెరికాలోని పెన్నిసెల్వినా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ అండ్ అప్లయిడ్ సైన్స్ విభాగంలో పట్టా పొందారు. ఇక దివా జైమిన్ షా.. వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. ముంబయి, సూరత్ లో ప్రముఖ వజ్రాల తయారీ కంపెనీలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications