సోనియాకు నమస్తే చెప్పిన అద్వానీ, పలకరింపు

ఆమెను చూడగానే ఎల్ కె అడ్వానీ లేచి నిల్చుని ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. అడ్వానీ ఆమెను కుశలప్రశ్నలు కూడా వేశారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది మార్గం చూపించడంతో సోనియా ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. దారిలో కనిపించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రణామం చేస్తూ ఆమె ముందుకు కదిలారు.
సోనియా రావడంతో అప్పటికే ఆసీనురాలైన మాజీ స్పీకర్ మీరా కుమార్ లేచి నిల్చున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లాక సోనియా, రాహుల్‌లను భద్రతా సిబ్బంది కూర్చోబెట్టారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రతిభా భారతి దంపతులు కూడా వచ్చి వారి పక్కన కూర్చున్నారు.
అద్వానీ మోడీ ప్రమాణ స్వీకారం సందర్బంగా ప్రతి ఒక్కరినీ పలకరించారు. అందరికీ అభివాదం చేస్తూ వారితో మాట్లాడారు.












Click it and Unblock the Notifications