అమ్మో ..అమెరికానా ? 70-80 శాతం తగ్గిపోయిన భారతీయ విద్యార్ధులు..!

ఒకప్పుడు అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలంటే భారతీయ విద్యార్ధులకు ఎంతో మోజు. మన దేశంలో మధ్యతరగతి వర్గాలు సైతం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మరీ పిల్లల్ని అమెరికాకు పంపేవారు. అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటే అక్కడే మంచి ఉద్యోగాలు దొరుకుతాయని, కుదరకపోతే కనీసం మన దేశానికి వచ్చి చెప్పుకోదగిన జీతాలతో ఉద్యోగాలు చేసుకోవచ్చనే భావన ఉండేది. కానీ ఇప్పుడు అది క్రమంగా కనుమరుగవుతోంది. దీనికి కారణం తాజా పరిణామాలే.

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉరుముతున్నారు. వీరిలో భారతీయ విద్యార్ధుల సంఖ్య గణనీయంగా ఉంది. వీరికి వీసాలు పొడిగించకపోవడం, ఏదైనా చిన్న కారణం దొరికితే వాటిని రద్దు చేసేయడం, కొత్తగా వీసాలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు విధించడం, ఆఖరికి సోషల్ మీడియా ఖాతాలు కూడా చెక్ చేసి వాటిలో ఎక్కడైనా చిన్న లోపం దొరికితే వీసా నిరాకరించడం సర్వసాధారణంగా మారిపోయాయి.

after visa issues and uncertainty 70-80 percent Indian students drops to fly US

ఈ నేపథ్యంలో అసలు అమెరికాకు ఎందుకు వెళ్లాలనే ప్రశ్న ఇక్కడి విద్యార్ధుల్లో తలెత్తుతోంది. అమెరికాలో తాజా వీసా నిబంధనలు, అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశాన్ని కాదని బ్రిటన్, కెనడా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు మన విద్యార్ధులు మొగ్గు చూపుతున్నారు. దీంతో సహజంగానే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్ధుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఈ మేరకు హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల నుంచి అమెరికాకు విద్యార్ధుల్ని పంపే కన్సల్టెన్సీలు సైతం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. విద్యార్ధుల ట్రాఫిక్ భారీగా పడిపోవడంతో కన్సల్టెన్సీల భవిష్యత్తు సైతం ఆగమ్యగోచరంగా మారుతోంది.

సాధారణంగా ఈ సమయానికి చాలా మంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను ముగించుకుని విమాన ప్రయాణానికి సిద్ధమయ్యేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం స్లాట్ తెరుస్తారనే ఆశతో ఇంకా ఎదురుచూస్తున్నారని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. ఇది అసాధారణ పరిస్ధితి అని వారు చెప్తున్నారు. దీనిపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. వీసా స్లాట్‌లను దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇస్తున్నారు. దీనిపైనా క్లారిటీ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+