వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం: రాత్రికిరాత్రే 48 మంది పైలట్ల తొలగింపు.. ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన 48 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది, వీరంతా గతేడాది రాజీనామా చేశారు. అయితే ఆరునెలల నోటీస్ పీరియడ్‌లో వారు కంపెనీ రూల్స్ ప్రకారం రాజీనామా వెనక్కి తీసుకొని.. తిరిగి విధుల్లో చేరారు. వారు ఎయిర్ బస్ 320 నడిపిస్తున్నారు.

 Air India sacks 48 pilots overnight, some were still flying..

ఎయిర్ ఇండియా ఆకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా పైలట్లను తొలగించాల్సి వచ్చిందని వారికి రాసిన లేఖలో తెలిపింది. కంపెనీ భారీ నికర నష్టాలను చవిచూస్తోన్న నేపథ్యంలో.. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తొలగించిన పైలట్లు గురువారం రాత్రి తమ సేవలను ముగించారని పేర్కొన్నది.

Recommended Video

#IndoChinastandoff : HAL Light Combat Helicopters Deployed In Ladakh || Oneindia Telugu

పైలట్ల తొలగింపును ఇండియన్ కమర్షియల్ పైలట్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్‌కు ఒక లేఖ కూడా రాసింది. పైలట్లను ఉద్యోగం నుంచి తొలగింపుపై చైర్మన్ రాజీవ్ బన్సాల్ జోక్యం చేసుకోవాలని కోరింది. రాజీనామా చేసి.. వెనక్కి తీసుకున్న వారిని తొలగించడం సరికాదన్నారు. కరోనా, ఆర్థిక ఇబ్బందులు పేరు చెప్పి ఉద్యోగులను ఎలా తీసివేస్తారని ప్రశ్నించింది.

English summary
Air India on Thursday sacked 48 pilots who resigned last year but withdrew their resignations within the six months notice period time as per rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X