రికార్డు సృష్టించిన ఎయిర్‌టెల్ '4జీ' గర్ల్ సషా చెత్రీ

ముంబై: టీవీలో సీరియల్స్ లేదా ఏదైనా సినిమా చూస్తున్న సమయంలో వచ్చే యాడ్స్ మనల్ని కాస్తంత ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటిది ఈ మధ్య కాలంలో టీవీలో వచ్చే వాణిజ్య ప్రకటన ఒకటి మాత్రం అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది.

కాలేజీ క్యాంపస్‌లో, బీచ్‌లో, ఇంట్లో, సినిమాహాల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ అబ్బాయిలాగా జట్టు కత్తిరించుకుని ఒక అమ్మాయి ప్రత్యక్షమై ‘ఈ ఫోన్‌ కన్నా మీ నెట్‌వర్క్‌ స్పీడ్‌గా ఉంటే, జీవితాంతం మీ ఫోన్‌ బిల్లు మేమే కడతాం' అంటూ హల్‌చల్‌ చేస్తోంది.

ఇది ‘4జీ' ప్రమోట్ చేసేందుకు గాను ఎయిర్ టెల్ ఇచ్చిన యాడ్ ఇది. ఒకే ఒక్క యాడ్‌తో కొన్ని కోట్ల మందికి దగ్గరైన 19 ఏళ్ల ‘సషా చెత్రీ' ప్రస్తుతం యాడ్‌ ప్రపంచంలో ఒక సంచలనం. అంతేకాదు బుల్లి తెరపై అతి తక్కువ సమయంలో ఎక్కువసార్లు కనిపించిన మోడల్‌గా రికార్డు సృష్టించింది.

Airtel 4G Ad Girl Sasha Chettri Creates Record

ఈ సందర్భంగా మోడల్ 'సషా చెత్రీ' గురించిన విశేషాలు మీకోసం:

* డెహ్రాడూన్‌కు చెందిన సషా చెత్రీ ఉన్నత చదువుల కోసం 16వ యేటనే ముంబైకి వచ్చింది.

* ముంబైలోని జేవియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌లో అడ్వర్టయిజింగ్‌ కోర్సులో డిగ్రీ చేసింది.

* ఆ తర్వాత ఒక యాడ్‌ ఏజెన్సీలో ట్రైనీ కాపీరైటర్‌గా పని చేసింది.

* మోడల్‌ కావాలనే కోరికతో చాలా మోడలింగ్‌ ఏజెన్సీలలో పేరు కూడా నమోదు చేసుకుంది.

* ఎయిర్ టెల్ ‘4జీ' ప్రకటనలో కనిపించడానికి ముందు సషా చెత్రీకి అసలు నటనపై అవహగాహన లేదు.

* ఆ తర్వాత ఎయిర్‌టెల్‌ '4జీ' క్యాంపెయిన్‌ కోసం తీసుకున్నారు.

* ఈ యాడ్‌‌లో ప్రత్యేకంగా కనిపించడం కోసం సషా చెత్రీ తన పొడవాటి జుట్టును కత్తిరించుకుంది.

* ఎయిర్‌టెల్ ‘4జీ' యాడ్‌ అన్ని టీవీ చానళ్లలో కలిపి రెండు నెలల కాలంలో (గతేడాది సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 20 వరకు) 54 వేల 406 సార్లు ప్రసారమైంది. అంటే సషా చెత్రీ మొత్తంగా 17 లక్షల 8 వేల 586 సెకన్లు (సుమారుగా 475 గంటలు) టీవీ తెరపై కనిపించింది. ఇది ఒక రికార్డు

* సంగీతమంటే ఇష్టం. ప్రస్తుతం ఒక మినీ ఆల్బమ్‌ రూపొందిస్తోంది.

* ఇమ్రాన్‌ ఖాన్‌, కంగనా రనౌత్ జంటగా గతేడాది విడుదలైన ‘కట్టీబట్టీ' సినిమాలో సంగీతకారిణిగా కొద్దిసేపు సినిమాలో కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+