వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనుమాన్ చాలీసా వివాదం : నవనీత్ కౌర్ దంపతులకు ఊరట-షరతులతో కూడిన బెయిల్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ సర్కార్ తో అమీతుమీ అంటున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణాకు ఇవాళ కోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన దేశద్రోహం కేసులో ఇద్దరికీ స్ధానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారికి స్వేచ్ఛ లభించనుంది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మత హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన దేశద్రోహం కేసులో మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే రవి రాణాకు బెయిల్ మంజూరైంది. ఇద్దరూ చెరో 50 వేల రూపాయల మేర ఒకటి కంటే ఎక్కువ పూచీ కత్తులు సమర్పించి బెయిల్ తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విచారణకు సహకరించాలని రానాలను ఆదేశించారు. పోలీసులు ఫోన్ చేస్తే వారే హాజరుకావాలి. రానాలను హాజరుకావాలని కోరడానికి 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలని విచారణ అధికారిని కోర్టు కోరింది.

Amaravati MP Navneet Rana couple got conditional bail in sedition case

వాస్తవానికి ముంబై కోర్టు ఆదివారం ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను మే 6 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి బయట హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తామనే బెదిరింపులకు సంబంధించి మతాల మధ్య శత్రుత్వం సృష్టించడమనే ఆరోపణపై ఏప్రిల్ 23న ఈ దంపతులను అరెస్టు చేశారు. నవనీత్ రానా తన వైద్య పరిస్థితి పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు . తాను స్పాండిలోసిస్‌తో బాధపడుతున్నానని, అయితే బలవంతంగా గంటల తరబడి నేలపై కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో అన్ని అంశాలు పరిశీలించిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

English summary
a maharastra court on today granted conditional bail to amaravati mp navneet rana and her husband ravi rana in sedition case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X