Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

amazon గ్రేట్ ఇండియన్ దీపావళి స్పెషల్ సేల్..అదిరిపోయే ఆఫర్ల జాతర!

దీపావళి పండుగ దగ్గర పడుతోంది. ఇక దీపావళి పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్లతో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే flipkart బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ను ఈనెల 11వ తేదీ నుండి వినియోగదారులకు అందిస్తున్నట్టు ప్రకటించగా, ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ దసరాకు ప్రారంభించిన తన గ్రేట్ ఇండియన్ సేల్ ను దీపావళికి కొనసాగిస్తోంది.

దీపావళి స్పెషల్ సేల్ ప్రారంభించిన అమెజాన్
నిన్నటి నుండి చిన్న చిన్న మార్పులతో దీపావళి సేల్ ను కొనసాగిస్తున్న అమెజాన్ భారీ ఆఫర్లను అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ పేరుతో ప్రస్తుతం ఆఫర్లను అందిస్తున్న అమెజాన్ ఎలక్ట్రానిక్స్ పైన 80 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ వాచీలు, కెమెరాలు, స్పీకర్లు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.

Amazon Great Indian Diwali Special Sale A fair of amazing offers

మొబైల్స్ పైన 80 శాతం వరకు భారీ డిస్కౌంట్స్
దీపావళి స్పెషల్ ఆఫర్స్ లో 80 శాతం వరకు అన్ని రకాల మొబైల్స్ పైన, మొబైల్ యాక్సెసరీస్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తోంది. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్ లపైన 65శాతం వరకు తగ్గింపునిస్తుంది. అంతే కాదు దీపావళి స్పెషల్ సేల్ సమయంలో బ్యాంకు కార్డుల పైన కూడా అమెజాన్ ఆఫర్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్, బాబ్ కార్డ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మరియు ఆర్బిఎల్ బ్యాంక్ కార్డు వినియోగదారులకు శుభవార్త చెప్పింది.

అమెజాన్ తో ఒప్పందం చేసుకున్న బ్యాంకు కార్డులపైన 10 శాతం తగ్గింపు
అమెజాన్ తో ఒప్పందం చేసుకున్న బ్యాంకు కార్డుల వినియోగం ద్వారా కొనసాగుతున్న దీపావళి స్పెషల్ సేల్ లో బోనస్ ఆఫర్లతో సహా 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.ఈ ఆఫర్ అక్టోబర్ 6 అర్ధరాత్రి నుండి అక్టోబర్ 12వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అవుతుందని అమెజాన్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది.

బోనస్ డిస్కౌంట్లను పదిసార్లు వరకు పొందే అవకాశం
క్రెడిట్ కార్డ్ ఈఎంఐ మరియు నాన్ emi లావాదేవీలపై ఆఫర్ కాలంలో బేస్ మరియు బోనస్ డిస్కౌంట్లను పదిసార్లు వరకు పొందేలా కోసం కల్పించింది. ఈ బోనస్ డిస్కౌంట్ ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రమే వర్తిస్తుందని అమెజాన్ ఇండియా పేర్కొంది. మొబైల్ ఫోన్లు, కిరాణా సామాను, ఫార్మసీ, డైలీ ఎసెన్షియల్ వంటి అనేక కేటగిరీలలో కస్టమర్లు 10 శాతం వరకు తక్షణ తగ్గింపును దీని ద్వారా పొందవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+