పూలతోటను తలపించే ఆటో! వేసవిలో గిరాకీ ఎక్కువేనట!
పుణే: సాధారణంగా ఎండా కాలంలో ఆటోలపై గోనెసంచులను కప్పేస్తుంటారు డ్రైవర్లు. చల్లదనం రావడానికి వాటిపై నీళ్లు చల్లుతుంటారు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. ఎండ వేడి తగలకుండా ఆటోను పూలతోటలా మార్చేశాడు. రోడ్డు మీద వెళ్తోంటే ఆ ఆటో ఓ కదులుతున్న పూల తోటలా కనిపిస్తుంటుంది జనానికి.
ఇలా వెరైటీగా ఆలోచించిన ఆ డ్రైవర్ పేరు ఇబ్రహీం ఇస్మాయిల్ థంబోలి. పుణేలోని రవివార్ పేట్‌లో నివాసం ఉంటున్నాడు. వయస్సు 45 సంవత్సరాలు. పాతికేళ్ల నుంచీ ఆటోను నడిపిస్తున్నాడు. వేసవి సీజన్‌లో ఎండ వేడిమిని భరించలేక ఆటో ఎక్కే ప్రయాణికులు ఎవరూ కనిపించరని, దీనివల్ల తన రోజువారీ ఆదాయం పడిపోతుంటుందని ఆందోళన చెందాడు.

ఈ గండం నుంచి గట్టెక్కడానికి మొదట్లో ఆయన చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. దీనితో- తన సృజనాత్మకతను పదును పెట్టాడు. ఆటో మొత్తాన్నీ పూలతోటలా మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన నిర్ణయాన్ని అమలు పెట్టాడు. మార్కెట్‌లో లభించే ప్లాస్టిక్ గడ్డి, పూలు, అల్లుకు పోయే గుణం ఉన్న మొక్కలను కొనుగోలు చేశాడు. వాటితో తన ఆటోను అలంకరించాడు.

తనకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే ఇష్టమని, తన ఆటోను కూడా అలాగే అలంకరించడం ఆనందాన్నిస్తోందని ఇబ్రహీం చెబుతున్నాడు. వేసవిలో గిరాకీ కూడా తగ్గట్లేదని, ఈ తరహా ఆటోలో ప్రయాణించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఆటోతో సెల్పీలు కూడా తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, ఫలితంగా- తనకు డిమాండ్ ఏర్పడిందని ఇబ్రహీం వెల్లడించాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications