ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. గజ"రాజు" వేడుకలు (వీడియో)
లక్నో : ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సందర్భంగా వేడుకలు కూడా జరిగాయి. ఏనుగేంటి, స్వాతంత్ర్యమేంటి, అసలు ఈ వేడుకలు ఏంటని ఆశ్యర్యపోతున్నారా. మీ అనుమానంలో తప్పు లేదు.. అలాగే ఈ వార్తలో కూడా అలాంటి తప్పేమీ లేదు. మీరు చదివింది నిజమే.. మేము రాసింది నిజమే.
50 సంవత్సరాలుగా ఓ వ్యక్తి చేతిలో బందీగా ఉంది ఈ ఏనుగు. గజరాజును అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుంటున్నాడు. ఎండనక, వాననక ఆ వ్యక్తి చేతిలో అలా యాభై ఏళ్ల పాటు బందీగానే ఉండిపోయింది ఐరావతం. అయితే అన్నీ సంవత్సరాలు ఆ యాచకుడు దాన్ని రోడ్లపై తిప్పుతూనే ఉన్నాడు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఏళ్లు ఈ గజరాజు అతడి చేతిలో బందీగా ఉన్న విషయం వైల్డ్ లైఫ్ ఎస్‌వోఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు తెలిసింది. దాంతో వారు రంగంలోకి దిగి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అలా ఆ యాచకుడి నుంచి 2014వ సంవత్సరంలో గజరాజును స్వాధీనం చేసుకుని మధురలోని ఏనుగుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడే దాని బాగోగులు చూస్తున్నారు.

అలా విముక్తి పొందిన ఏనుగుకు రాజు అని పేరు పెట్టారు. అయితే దాన్ని రక్షించి ఐదేళ్లు అవుతున్న సందర్భంగా వైల్డ్ లైఫ్ ఎస్‌వోఎస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వేడుకలు నిర్వహించారు. కేక్ కోసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఏనుగు ముందర కేక్ పెట్టడంతో ఆరగించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications