పీఎన్‌బీలో మరో స్కాం.. ఈసారి రూ.9.1 కోట్లు! ఇదీ నీరవ్ మోడీ తరహాలోనే...
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఆర్థిక మోసాలు ఇప్పట్లో ఆగేలా లేవు. నీరవ్ మోడీ రూ.12 వేల కోట్ల కుంభకోణం మరువకముందే అదే ముంబై పీఎన్‌బీ బ్రాంచిలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ఈసారి స్కాం విలువ రూ.9.1 కోట్లు.
ఈ కుంభకోణం కూడా నీరవ్ మోడీ స్కాం తరహాలోనే అధికారుల సహకారంతో జరిగింది. ఈ విషయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులు గుర్తించారు. బ్యాంకు అధికారుల సహకారంతో చంద్రీ పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీ ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది.

కాగ, గత నెలలో వెలుగులోకి వచ్చిన నీరవ్ మోడీ కుంభకోణంలో పీఎన్‌బీ ముంబై బ్రాంచ్‌లో దాదాపు రూ.12,700 కోట్ల అవకతవకలు జరిగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి రాకముందే, ఈ భారీ మోసానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోడీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సి, కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయారు.
వీరిని ప్రస్తుతం భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మోడీ, చోక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను కూడా కోరుతోంది ఈడీ. మరోవైపు తాజాగా వెలుగులోకి వచ్చిన రూ.9.1 కోట్ల స్కాంపై ఇటు పీఎన్‌బీ అధికార ప్రతినిధి కానీ, అటు చంద్రీ పేపర్ కానీ వెంటనే స్పందించడం లేదు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications