AP-TS weather: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వాయుగుండంగా అల్పపీడనం

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరి కొద్ది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3 .6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఒక ద్రోణి , ఉత్తర అంతర్గత తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బెంగాల్ వరకు ఆంధ్ర , ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నవంబర్ 15 నాటికి వాయుగుండంగా అల్పపీడనం

నవంబర్ 15 నాటికి వాయుగుండంగా అల్పపీడనం

కాగా, థాయిలాండ్ , దానిని అనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వలన, దక్షిణ అండమాన్ సముద్రం, థాయిలాండ్ తీరం మీద ఆదివారం అల్ప పీడనం ఏర్పడింది. ఈ అల్ప పీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర అండమాన్ , దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద వాయుగుండంగా.. నవంబర్ 15వ నాటికి బలపడి వాయుగుండంగా అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణం కొనసాగించి.. మరింత బల పడి ఆంధ్రప్రదేశ్ తీరాన్నీ నవంబర్ 18 , 20 21 వ తేదీల్లో తాకే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రాగాల మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఏపీలో చాలా చోట్ల చాలా చోట్ల వర్షాలు

ఏపీలో చాలా చోట్ల చాలా చోట్ల వర్షాలు

ఉత్తర కోస్తాంధ్రా, యానాంలలో ఆదివారం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లవిస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఆదివారంనాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్లవిస్తారంగా కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ ఆదివారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లవిస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
    తెలంగాణలోనూ వర్షాలు, ఏపీని తాకనున్న వాయుగుండం

    తెలంగాణలోనూ వర్షాలు, ఏపీని తాకనున్న వాయుగుండం

    ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కిందిస్థాయి గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపింది. శనివారం నాటి అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆదివారం మధ్య అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని వాతావరణ శాక తెలిపింది. ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 15న ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుిన ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. తదుపరి ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ తూర్పు-మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పయనిస్తూ నవంబర్ 17న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుంగుండంగా బలపడనుందని పేర్కొంది. నవంబర్ 18న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని చేరే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఉత్తర తమిళనాడు వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ ఒడిశా మీదుగా సిక్కింలోని గ్యాంగ్‌టక్, పశ్చిమబెంగాల్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు కొనసాగి ఆదివారం బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+