రైలు ప్రమాదాల నివారణకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్.. రైల్వేబోర్డు కీలక ప్రకటన!
దేశవాసులను భయాందోళనలకు గురి చేసేలా రైలు ప్రమాదాల ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో పెరిగిపోతున్న రైలు ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ప్రణాళికను ప్రకటించింది. రైళ్ల ప్రమాదాల నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్ పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా తాజాగా ఒక ప్రకటన చేశారు.
రైలు ప్రమాదాల నివారణకు ఏఐ తో పనిచేసే సీసీటీవీ కెమెరాలు
ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్ లో వచ్చే ఏడాది కుంభ మేళ ఏర్పాట్ల పైన మాట్లాడిన జయవర్మ సిన్హా అన్ని రైళ్లు, కీలకమైన అన్ని రైల్వే యార్డుల వద్ద ఏఐ తో పనిచేసే సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు వెల్లడించారు. ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. రైల్వే భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కుంభమేళా రైల్వే ఏర్పాట్లపై మాట్లాడిన రైల్వే బోర్డు సిఈవో
ఇక రైల్వే ట్రాక్ భద్రత పైన మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కుంభమేళా నేపథ్యంలో సంఘవిద్రోహులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా రైల్వే ట్రాక్ల పైన భద్రతా సంస్థలు నిరంతర నిఘా ఏర్పాటు చేస్తాయని ఆమె స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం కుంభమేళా ప్రారంభానికి ముందే రైల్వే కి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
కుంభమేళాకు 900 ప్రత్యేక రైళ్ళు
2025 లో జరిగే కుంభమేళా కోసం దాదాపు 900 ప్రత్యేక రైళ్ళు నడపనున్నామని ప్రకటించిన ఆమె 2019 కుంభమేళా సందర్భంగా 530 ప్రత్యేక రైలు నడిపామని గుర్తు చేశారు. ఈసారి కుంభమేళాకు ముప్పై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని అత్యవసర పరిస్థితులలో రద్దీ నివారణ కోసం అవసరమైన ప్రణాళికలను రూపొందించి ముందుకు వెళతామని ఆమె పేర్కొన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో రైలు ప్రమాదాల నివారణకు కృషి
ఇక ప్రయాగ్ రాజ్ జంక్షన్ ను అమృత భారత్ స్టేషన్ గా ఎంపిక చేశామని ఆ దిశగా ఆధునీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న ఆమె రైలు ప్రమాదాలు జరగకుండా ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయని మరింత అడ్వాన్స్ టెక్నాలజీ తో రైలు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications