• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Aryan khan Drugs case: అనన్య పాండేను విచారించిన ఎన్సీబీ.. ఆ చాట్ లో జోక్ చేశా; ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ !!

|
Google Oneindia TeluguNews

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఉచ్చులో గట్టిగానే చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ చాట్ చేసిన విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే కు ఎన్సీబీ షాక్ ఇచ్చింది. లైగర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న నటీమణి అనన్య పాండే కూడా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నట్టు తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది.

Aryan khan Drugs case: విజయ్ దేవరకొండ హీరోయిన్ కు డ్రగ్స్ మరక; షారుఖ్ ఖాన్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు !!Aryan khan Drugs case: విజయ్ దేవరకొండ హీరోయిన్ కు డ్రగ్స్ మరక; షారుఖ్ ఖాన్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు !!

అనన్య పాండే తో ఆర్యన్ ఖాన్ చాట్

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఈరోజు ప్రశ్నించింది. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్ ఖాన్ మొబైల్లో అనన్య పాండే తో చేసిన డ్రగ్స్ చాట్ ను గుర్తించారు. ఈ క్రమంలో గురువారం రోజు అనన్య పాండే ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చేసి, అనన్య పాండే ల్యాప్ ట్యాప్ ను, ఆమె మొబైల్ ఫోన్ లను సీజ్ చేశారు. అనంతరం ఆమెను విచారించారు. విచారణకు ముందు అనన్య పాండే ఏడ్చినట్టు సమాచారం . అనన్య పాండేను మళ్ళీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

ఎన్సీబీ ముందు విచారణకు హాజరైన అనన్య పాండే

ఎన్సీబీ ముందు విచారణకు హాజరైన అనన్య పాండే

దీంతో ఈ రోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందు విచారణకు హాజరైన అనన్య పాండే కు అధికారులు పలు ప్రశ్నలను సంధించారు. ఆర్యన్ ఖాన్ తో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఆర్యన్ ఖాన్ తో కలిసి మీరు పార్టీలకు వెళ్లేవారా? మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? పార్టీలో ఆర్యన్ ఖాన్ కానీ ఇతర బాలీవుడ్ ప్రముఖులు కానీ డ్రగ్స్ తీసుకోవడం మీరు చూశారా? ఆర్యన్ ఖాన్ తో వాట్సప్ చాటింగ్ చేసింది మీరేనా? ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ డీలర్లతో పరిచయం వివరాలు మీకేమైనా తెలుసా? వంటి అనేక ప్రశ్నలను అనన్య పాండేకు ఎన్సీబీ అధికారులు సంధించారు. అయితే ఈ ప్రశ్నలకు లేదు, కాదు అంటూ ముక్తసరిగా అనన్య పాండే సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆర్యన్ ఖాన్ తో చేసిన డ్రగ్స్ చాట్ చూపించి ప్రశ్నించగా అనన్య పాండే తాను ఆర్యన్ తో జోక్ చేశానని చెప్పినట్టు సమాచారం.

ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ డీలర్స్ నంబర్స్ ఇచ్చింది అనన్య పాండే ?

ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ డీలర్స్ నంబర్స్ ఇచ్చింది అనన్య పాండే ?

అక్టోబర్ 2 న క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీపై దాడి చేసిన ఘటనలో అరెస్టయిన షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఫోన్‌లో దొరికిన వాట్సాప్ చాట్‌ల ఆధారంగా 22 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో విచారణకు పిలిచారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సేకరించడంలో అనన్య పాండే సహాయ పడిందన్న అనుమానాలను ఎన్సీబీ వ్యక్తం చేస్తుంది. 2018-19 సంవత్సరంలో ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్ నుండి అనన్య పాండే కు చేసినట్టు సేకరించిన చాట్‌లు, ఆమె డ్రగ్ డీలర్ల నంబర్ లను అందించడం ద్వారా ఆర్యన్‌కు మూడుసార్లు డ్రగ్స్ సరఫరా చేయడంలో సహాయపడిందని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. అనన్య పాండే ఆర్యన్ ఖాన్ సోదరి సుహానాకు మంచి స్నేహితురాలు. వారందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.

డ్రగ్స్ ఆరోపణలను ఖండించిన అనన్య పాండే .. ల్యాప్ టాప్, మొబైల్స్ ను పరిశీలిస్తున్న ఎన్సీబీ

డ్రగ్స్ ఆరోపణలను ఖండించిన అనన్య పాండే .. ల్యాప్ టాప్, మొబైల్స్ ను పరిశీలిస్తున్న ఎన్సీబీ

అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో చాట్ సంభాషణలో డ్రగ్స్ సరఫరా సంబంధిత చర్చలను అనన్య తిరస్కరించింది . ఆమె ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని, సరఫరా చేయలేదని ఎన్సిబి అధికారులకు చెప్పిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే గురువారం రోజు కూడా ఆమెను రెండు గంటల పాటు ఎన్సిబి అధికారులు విచారించారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగింది. అనన్య పాండే యొక్క రెండు ఫోన్‌లను మేము స్వాధీనం చేసుకున్నాము, ఇందులో పాత హ్యాండ్‌సెట్‌తో పాటు కొన్ని నెలల క్రితం ఆమె కొనుగోలు చేసిన ఫోన్ కూడా ఉందని, సాక్ష్యాల ట్యాంపరింగ్‌ను తనిఖీ చేయడానికి ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని ఎన్సీబీ వర్గాలు పేర్కొన్నాయి.

English summary
Bollywood beauty Ananya Pandey was questioned by NCB officials during the trial in the Aryan Khan drug case. NCB has asked a lot of questions to her, she said that she made a joke in that chat. Information that she cried before the trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X