• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మదర్సాలు అక్కర్లేదని అస్సాం సీఎం షాకింగ్ కామెంట్స్; రివర్స్ ఎటాక్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ

|
Google Oneindia TeluguNews

ముస్లిం విద్యార్థులకు ఖురాన్ నేర్పించండి కానీ మదర్సాలు వద్దంటూ అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మదర్సాలపై బిజెపి నాయకుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. అవి "శాఖల మాదిరిగా కాకుండా" ఆత్మగౌరవం మరియు సానుభూతిని బోధిస్తున్నాయని ఓవైసీ పేర్కొన్నారు.

మదర్సాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం

మదర్సాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం

అంతకుముందు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో శర్మ, "మదర్సాలు" ఉన్నంత వరకు పిల్లలు డాక్టర్లు మరియు ఇంజనీర్లు కావాలని ఆలోచించలేరు అని సర్. "మానవ హక్కులను ఉల్లంఘిస్తూ" పిల్లలను మదర్సాలో చేర్పిస్తున్నారని పేర్కొంటూ, 'మదర్సా ' అనే పదం "కనుమరుగైపోవాలి" ఇక వినిపించ కూడదు అని అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ పేర్కొన్నారు.

మదర్సాలలో చదివితే పిల్లలకు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని అలోచన రాదు

మదర్సాలలో చదివితే పిల్లలకు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని అలోచన రాదు

ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం) బోధించవద్దని ఎవరూ అనరు. కానీ అంతకంటే ఎక్కువగా విద్యార్థికి సైన్స్, గణితం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం నేర్పించాలి అని హిమంత బిస్వ శర్మ అన్నారు. రెండు మూడు గంటలు మత బోధనలు చెప్పొచ్చు కానీ పాఠశాలల్లో, ఒక విద్యార్థి ఇంజనీర్ లేదా డాక్టర్ అయ్యేలా ఒక పద్ధతిలో బోధించాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.

అస్సాం వరదల సమయంలో సీఎం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు: ఓవైసీ

అస్సాం వరదల సమయంలో సీఎం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు: ఓవైసీ


శర్మ వ్యాఖ్యపై మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు స్పందిస్తూ, అనేక మదర్సాలు ఇస్లాంతోపాటు సైన్స్, గణితం మరియు సాంఘిక అధ్యయనాలను బోధిస్తున్నాయని పేర్కొన్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో 18 మంది మరణించి, ఏడు లక్షల మంది నిరాశ్రయులైన సమయంలో అస్సాం సీఎం "ద్వేషపూరిత ప్రసంగాలతో బిజీగా ఉన్నారు" అని ఓవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "సంఘీలు బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేస్తున్నప్పుడు" భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు.

రాజా రామ్ మోహన్ రాయ్ మదర్సాలో ఎందుకు చదువుకున్నారు? ఓవైసీ

రాజా రామ్ మోహన్ రాయ్ మదర్సాలో ఎందుకు చదువుకున్నారు? ఓవైసీ


హిందూ సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ మదర్సాలో ఎందుకు చదువుకున్నారు? అని ప్రశ్నిస్తూ ఓవైసీ ట్వీట్ చేశారు. ముస్లిం పూర్వీకుల మీద మమకారం మీ న్యూనతను తెలియజేస్తుంది. ముస్లిములు భారతదేశాన్ని సుసంపన్నం చేసారు అంటూ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.

మదర్సాలను రద్దు చేసి రెగ్యులర్ స్కూల్స్ గా మార్చాలని అస్సాం ప్రభుత్వ నిర్ణయం

మదర్సాలను రద్దు చేసి రెగ్యులర్ స్కూల్స్ గా మార్చాలని అస్సాం ప్రభుత్వ నిర్ణయం

2020లో, హిమంత బిస్వ శర్మ విద్యా మంత్రిగా ఉన్నప్పుడు, అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మదర్సాలను రద్దు చేసి, సాధారణ విద్య కోసం "రెగ్యులర్ స్కూల్స్"గా మార్చాలని నిర్ణయించింది. "సెక్యులర్‌గా మార్చడానికి విద్యావ్యవస్థను సంస్కరించే ప్రయత్నంలో మదర్సా ఎడ్యుకేషన్ ప్రొవిన్సియలైజేషన్ యాక్ట్, 1955 మరియు అస్సాం మదర్సా ఎడ్యుకేషన్ (ఉద్యోగుల సేవల ప్రొవిన్షలైజేషన్ మరియు మదర్సా విద్యా సంస్థల పునర్వ్యవస్థీకరణ) చట్టం, 2018ని రద్దు చేస్తూ అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది. గౌహతి హైకోర్టు ఈ సంవత్సరం చట్టాన్ని సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క తదుపరి ఆదేశాలు మరియు కమ్యూనికేషన్‌ను హైకోర్టు సమర్థించింది.

English summary
Assam CM Himanta Biswa Sharma made shocking comments that the word 'madrassa' did not exist. MIM chief Asaduddin Owaisi reacted to his remarks. Commented that they are not like your shakhas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X