టార్గెట్ 2019: పార్టీ నేతలతో మోడీ విందు మీటింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి సీనియర్ నాయకులతో గురువారం రాత్రి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికలతో పాటు ఈ ఏడాదిలో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్ర మంత్రివర్గ సభ్యులు, ఆయా రాష్ట్రాల ఇంచార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 At PM Modi's Home, Dinner And Brainstorming Session For 2019 Polls

2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ నేతలకు ఈ సందర్భంగా పీఎం మోడీ విందు ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే చివరి ఏడాది ఇదే. అయితే సుమారు మూడు గంటల పాటు పార్టీ నేతలతో మోడీ చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయమై మోడీ ఈ సందర్భంగా పార్టీ నేతలతో చర్చించారు.

ఈ ఏడాది మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారని సమాచారం.

2014 ఎన్నికల్లో బిజెపి విజయంలో యువత, మహిళల ఓటర్లు కీలకంగా వ్యవహరించారు.జనవరి 18, బిజెపి మిలీనియం ఓటు క్యాంపెయిన్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi met key BJP leaders - his ministers, general secretaries and state in-charges - at his official residence on Thursday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X