భారీ హింసతో కర్ఫ్యూ, ఏటీఎంలు, బ్యాంకులు ఓపెన్, ఇంటర్నెట్ మాత్రం !

గురుగ్రామ్/హరియాణ: భారీ హింసాకాండ తర్వాత హరియాణలోలోని నుహ్ జిల్లాలో సాధారణ స్థితికి వస్తున్నది. జూలై 31న హరిమాలోని నుహ్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు రెండు మతాల మధ్య హింస చెలరేగడంతో కర్ఫ్యూ విధించారు. ఇప్పుడు కర్ఫ్యూ ఉపసంహరించుకోవడంతో ఏటీఎంలు తెరుచుకున్నాయి.

ఘర్షణలు జరిగిన వారం రోజుల తర్వాత కర్ఫ్యూను సడలిస్తున్నారు. ప్రజల సౌకర్యాలు, అవసరాల కోసం కర్ఫ్యూను ఈరోజు సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు (నాలుగు గంటలు) సడలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. అలాగే నుహ్‌లో బ్యాంకులు, ఏటీఎంలు కూడా ప్రయోగాత్మకంగా తెరుచుకున్నాయి.

ATMs

నుహ్, టౌరు, పున్హానా, ఫిరోజ్‌పూర్ జిర్కా, పింగావ్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో సోమవారం 5 గంటల వరకు (ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు) కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచారు. అలాగే ఏటీఎంలు మూడు గంటల పాటు అంటే ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నగదు లావాదేవీలు చేయవచ్చు అని అధికారులు తెలిపారు. ఆగస్టు 7వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేశాయి.

కురుక్షేత్ర, పంచకుల, కర్నాల్, హిసార్, పానిపట్ అనే ఐదు జిల్లాలో సీఈటీ పరీక్షా కేంద్రాలకు ఆదివారం ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఇది కూడా ఆగస్ట్ 7న నడుస్తుంది. సంబంధిత సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రాంతాల్లో వైద్య సహాయం, అత్యవసర అవసరం ఉన్న వ్యక్తుల కోసం కర్ఫ్యూ సమయంలో కదలికను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అందుకోసం వారికి కర్ఫ్యూ పాస్‌లు ఇస్తామని అధికారులు తెలిపారు.

ఇంకా హరియాణ ప్రభుత్వం నహాలో మొబైల్ ఇంటర్నెట్ సేవల సస్పెన్షన్‌ను ఆగస్టు 8 వరకు పొడిగించింది. జూలై 31న హరియాణలోని నుహ్‌లో నల్హర్ దేవాలయం సమీపంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఊరేగింపుపై ఓ వర్గం వాళ్లు దాడి చేయడంతో మొదట ఘర్షణలు చెలరేగాయి. హింస వెంటనే గురుగ్రామ్ తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వ్యాపించింది.

ATMs
స్వీట్ ఆంటీ వాయిస్, నైస్ గా రూ. 41 లక్షలు స్వాహా, గొంతు ఎవరిది అంటే !

ఈ ఘర్షణలో ఇద్దరు హోమ్ గార్డులు, ఓ ఇమామ్ తో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందగా, 88 మంది గాయపడ్డారు. గురుగ్రామ్‌లో, ఒక వర్గం మసీదులను లక్ష్యంగా చేసుకుంది, వందకు పైగా వాహనాలను తగలబెట్టింది, దుకాణాలు మరియు ఇళ్లను తగలబెట్టింది. మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 216 మందిని అరెస్టు చేశామని, 104 కేసులు నమోదు చేసినట్లు హరియాణ పోలీసు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలపైనా పోలీసులు నిఘా పెట్టారు.

ATMs

హింసాకాండ తరువాత హరియాణలోని నుహ్ జిల్లా యంత్రాంగం చట్టవిరుద్ధంగా నిర్మించిన ఇళ్లపై బుల్డోజర్ డ్రైవ్‌ను ప్రారంభించింది, ఇది సోమవారం ఐదవ రోజుకు చేరుకుంది. శనివారం నూహ్‌లో దాదాపు రెండు డజన్ల మెడికల్‌ దుకాణాలు, ఇతర దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ వారం ప్రారంభంలో వీహెచ్ పీ ఊరేగింపుపై దాడికి దారితీసే మార్గంలో నల్హర్‌లోని అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నందుకు హింసాత్మకమైన నుహ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హరియాణ ప్రభుత్వం ధ్వంసం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+